అమ్మను మించిన రాజకీయం!!

0
557
sashikala political knowledge

Posted [relativedate]

sashikala political knowledge
తమిళనాడులో అనుకున్నదే జరిగింది. సెల్వం ప్లేసులో చిన్నమ్మ ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్నారు. త్వరలోనే ఆమె ఆ సీట్లో కూర్చునేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా శశికళను ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వమే ఆమె పేరును ప్రతిపాదించడం గమనార్హం.

తాను సీఎం పీఠమెక్కేందుకు చిన్నమ్మ చాలా ప్లాన్డ్ గా ముందుకెళ్లారు. చాలా తెలివిగా పన్నీర్ సెల్వం బలాన్ని తగ్గించారు. ముందు సెల్వం వెనక ఉన్న ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోవడంలో విజయం సాధించారు. నయానో భయానో తన దారిలోకి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా తన దగ్గరకు పిలుచుకున్నారు. అనుకున్న వాళ్లకు మంత్రిపదవి.. లేకపోతే మరో పదవి ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. వింటే ఓకే.. లేకపోతే మరో రకంగా ఉంటుందని సుత్తిమెత్తగా హెచ్చరించి పంపారు. దీంతో ఎమ్మెల్యేలంతా చిన్నమ్మ రూట్లోకి వచ్చేశారు.

ముందు ఎమ్మెల్యేలను దార్లోకి తెచ్చుకొని.. తర్వాత సెల్వంపై గురిపెట్టారు శశికళ. సెల్వంకు పెరుగుతున్న ఆదరణ, కేంద్రం మద్దతును గమనించిన శశికళ.. ఇక ఉపేక్షిస్తే తనకే ఇబ్బందులు తప్పవనే అవకాశముందన్న ఉద్దేశంతో పావులు కదిపారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపడతానని పార్టీ పెద్దలతో పాటు సెల్వంకు స్పష్టం చేశారు. దీంతో ముందు సెల్వం బెట్టు చేశారు. పార్టీ కేడర్‌తో పాటు ఎమ్మెల్యేలు కూడా తన వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడే శశికళ రాజకీయం తెలిసింది. ఎమ్మెల్యేలంతా ఎప్పుడో తన దారిలోకి వచ్చేశారని పేర్లతో సహా లిస్టును సెల్వం ఎదుట పెట్టారట. దీంతో శశికి జై కొట్టడమే తప్ప సెల్వం కు మరోమార్గం లేకుండా చేశారు. చివరకు సెల్వం స్వయంగా శశికళ పేరును ప్రతిపాదించేలా చేయగలిగారు. ఈ మొత్తం ఎపిసోడ్ చాలా తెలివిగా… ఎక్కడా వ్యతిరేకత రాకుండా విజయం సాధించారు చిన్నమ్మ. అమ్మ అంత కాకపోయినా.. తానూ ఏమాత్రం తక్కువ కాదని చాటిచెప్పారు. సెల్వం కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించారు.

Leave a Reply