శశికళ జడ అల్లిన ఎంపీ…

0
925

 sasikala tiruchi siva tamil nadu new photo
శశికళ పుష్ప …అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆగ్రహ జ్వాలల్లో నలిగిపోతున్న ఎంపీ.ఇప్పటికే పలు కేసులతో ఇబ్బందిపడుతున్న ఆమెకి సంబంధించి మరికొన్ని ఫోటోలు వెలుగు చూశాయి.ఈ అలజడికి కారణమైన తిరుచ్చి శివతో కలిసి ఆమె వున్న మరికొన్ని చిత్రాల్ని అన్నాడీఎంకే వర్గాలు సోషల్ మీడియా లో పెట్టాయి.ఆ ఫొటోల్లో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ …శశికళ పుష్పకి జడ అల్లుతూ కనిపించాడు.ఈ ఫోటోలు తమిళనాట తీవ్ర చర్చకి దారి తీశాయి.

ఇంతకుముందు కూడా వాళ్లిద్దరూ కలిసున్న ఫోటోలు సంచలనం రేపాయి.తాజాగా అన్నాడీఎంకే వర్గాలు చెప్పి మరీ ఆమె చిత్రాలు బయటపెట్టడం రాజకీయాన్ని మరింత వేడెక్కించింది.అయితే శశికళ పుష్ప మాత్రం ఎప్పటిలాగానే అవి మార్ఫింగ్ ఫోటోలని చెప్పి వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది.

Leave a Reply