పోయస్ గార్డెన్ మహత్యం ..శశికళకి అమ్మ పూనకం ?

0
585
sasi poyes garden

Posted [relativedate]

sasi poyes garden
పోయస్ గార్డెన్ మహత్యం ఏమిటో గానీ దాని మీద అజమాయిషీ చెల్లించేవాళ్ళకి కుటుంబ సభ్యులు దూరం అవుతారు..కాదు ..కాదు వీళ్ళే పెడతారు. పోయస్ గార్డెన్ గాలి మహిమో …అధికార మత్తు ఫలితమో జయలలిత అదే విధంగా చేశారు.తొలి దశలో ఆమెకి దగ్గరగా వున్న కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా దూరమైపోయారు. ఆ దూరం చివరి దాకా దూరంగానే మిగిలిపోయింది. తీరని ఎడబాటుగానే ఉండిపోయింది. చివరికి మృత్యు ముఖంలో వున్న జయని చూసేందుకు కూడా ఆమె కుటుంబ సభ్యులు నోచుకోలేకపోయారు. ఇప్పుడు జయ చిన్నమ్మ శశికళకి కూడా పూనిందట. పోయస్ గార్డెన్ లో జరుగుతున్న తాజా పరిణామాలు అందుకు ప్రబల సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

జయ మరణం తర్వాత ఆమె మృతదేహం చుట్టూ శశికళ బంధువర్గమే వుంది. మన్నారుగుడి మాఫియా పోయస్ గార్డెన్ ని ఆక్రమించేసిందని అంతా అనుకున్నారు. అయితే ఇంతకాలం వెన్నంటి వున్న మన్నారుగుడి మాఫియా కి శశికళ షాక్ ఇచ్చారంట.ఇకపై ఎవరూ తనకు తెలియకుండా ప్రభుత్వ,పార్టీ వ్యవహారాల్లో వేలు పెడితే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చిన్నమ్మ హెచ్చరించారట.బయట వస్తున్న విమర్శల నేపథ్యంలో ఇదేదో నామమాత్రపు హెచ్చరిక అయ్యి ఉంటుందని మన్నారుగుడి మాఫియా కూడా భావించిందంట. అయితే ఆ మీటింగ్ జరిగిన మూడు రోజుల్లోనే వారికి సీన్ అర్ధమైపోయింది. స్వయంగా శశికళ భర్త నటరాజన్,ఆమె సోదరులు వచ్చినా పోయస్ గార్డెన్ తలుపులు తెరుచుకోలేదట.దీంతో విషయం అర్ధమైన వాళ్ళు విషయం బయటికి పొక్కక ముందే అక్కడి నుంచి జారుకున్నారట. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి శశికళకి అమ్మ పూనిందని అన్నాడీఎంకే నాయకులు చెప్పుకుంటున్నారట. అయితే ఇది తాత్కాలిక వ్యవహారమే అనేవాళ్లు కూడా లేకపోలేదు. జయలలిత వలే శశికళ భావోద్వేగాలతో ముందుకెళ్లారని ఏది చేసినా వ్యూహాత్మకమేనని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు .తాజా ఎపిసోడ్ కూడా అలాంటిదే అన్న సందేహాలున్నాయి. దేనికైనా కాలమే తగిన జవాబిస్తుంది.అందాకా వేచి చూడాల్సిందే…

Leave a Reply