Posted [relativedate]
జయలలిత ఓ పక్క ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే …. ఆ కుటుంబం మాత్రం సీఎం ఛైర్ కోసం కుట్రలు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ కుట్రదారులెవరో కాదు. జయలలితకు ఆప్తమిత్రురాలు శశికళ కుటుంబసభ్యులే. సీఎం కుర్చీ కోసం వీళ్లంతా పక్క ప్రణాళికను అమలు చేసినా… అది వర్కవుట్ కాలేదు. కేవలం 6 గంటల్లోనే వారి కలలన్నీ కల్లలైపోయాయి. వారు ఆశించినది అందనంత ఎత్తులో మిగిలిపోయింది. ఒక్కసారిగా ఆ 6 గంటల్లో ఏం జరిగిందో చూస్తే…
జయలలిత మరణానికి కేవలం కొన్ని గంటల ముందు శశికళ కుటుంబం ఒక్క చోట చేరిందట. ఈ కుటుంబాన్ని మన్నార్కుడి మాఫియా గ్యాంగ్ గా పిలుస్తారు. దీనికి అంతా శశికళేనని చెబుతారు. జయలలిత ప్రాణానికి ముప్పు పొంచి ఉన్న తరుణంలో… జాగ్రత్త పడాలని మన్నార్కుడి గ్యాంగ్ భావించిందట. అందులో భాగంగా శశికళను సీఎంను చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సమాచారం. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం జయ సాకుతో తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని… అది మరీ ఎక్కువవుతోందని.. ఇలాగైతే శశికళకు కష్టమేనని వారంతా అంచనా వేశారట. వెంటనే అందుకోసం స్కెచ్చేశారట. అందులో భాగంగా జయలలిత మరణానికి కొన్ని గంటల ముందు అంటే సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు శశికళ వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం లేకుండానే భేటీ అయ్యారట. శశికళను అన్నాడీఎంకే చీఫ్ గా … శశికళ వర్గానికే చెందిన పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని భావించారట. అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని ప్రచారం జరిగింది.
5 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ పెద్దల నుంచి శశికళ వర్గానికి ఫోన్ వచ్చింది. ముందు ఈ సమావేశాల పేరుతో కుట్రలు చేయడం మానుకోవాలని…లేనిపోని ప్రకటనలు చేయొద్దని గట్టి వార్నింగ్ వచ్చిందట.
6 గంటల 4 నిమిషాలకు తమిళనాడు బీజేపీకి చెందిన మహిళా కేంద్రమంత్రి ఒకరు అపోలో హాస్పిటల్ కు వచ్చారని సమాచారం. శశికళ వర్గానికి ఢిల్లీ పెద్దలు ఎంత సీరియస్ గా ఉన్నారట వివరించారట.
6 గంటల 57 నిమిషాల వరకు ఈ మీటింగ్ కొనసాగిందట. లేనిపోనివి చేస్తే అసలుకే ప్రమాదం వస్తుందని హెచ్చరించారట. ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని సున్నితంగానే మందలించారని సమాచారం. అన్నాడీఎంకే ఉనికికే ప్రమాదమని కూడా తనదైన స్టైల్ లో శశికళ వర్గానికి ఢిల్లీ పెద్దల అంతరంగాన్ని వివరించారట.
7 గంటల 10 నిమిషాలకు అపోలో హాస్పిటల్ 2 వ ఫ్లోర్ లోని రూం నెంబర్ 207 లో శశికళ వర్గం భేటీ అయ్యింది. ఇక లేనిపోనివి చేయటం కంటే కేంద్రం చెప్పినట్టు నడుచుకోవడమే బెటరనే నిర్ణయానికి వచ్చేశారట. ఒకరకంగా కుట్రలకు ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టేద్దామని మూకుమ్మడిగా నిర్ణయించారట.
11 గంటల 10 నిమిషాలకు పన్నీరు సెల్వం సమక్షంలో పార్టీ ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు. మోడీ ఛాయిస్ పన్నీరు సెల్వమేనని నిర్ణయించుకున్నారు. ఇక సెల్వంనే సీఎం చేయాలని డిసైడయ్యారు.
రాత్రి 12 గంటల 10 నిమిషాలకు జయ మరణించారని అధికారిక ప్రకటన వచ్చింది. 12 గంటల 50 నిమిషాలకు పన్నీర్ సెల్వం గవర్నర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జయ కేబినెట్ లోని మంత్రులనే తిరిగి అదే స్థానంలో నియమించారు.
ఇలా కేవలం 6 గంటల్లో ఎన్నో డెవలప్ మెంట్స్ జరిగాయి. శశికళ వర్గం కుట్రలన్నీ బెడిసికొట్టాయి.