జైల్లో ఉన్న ఖైదీని పరామర్శించాలంటే సహజంగా సాయంత్రం ఐదు గంటల లోపే అనుమతి ఉంటుంది.కానీ రాత్రి 7 గంటల సమయంలో ఓ vip ఖైదీని పరామర్శించాలంటే చిన్న విషయం కాదు. కానీ శశికళ ఉంటున్న బెంగుళూరు పరప్పన అగ్రహార జైల్లో ఇదే జరిగినట్టు తెలుస్తోంది. మేనల్లుడు దినకరన్ తో భేటీ తర్వాత శశికళ ,సినీ నటి విజయశాంతితో రహస్య సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.ఇంత అర్జెంటు గా రాములమ్మతో చిన్నమ్మ భేటీ ఆసక్తి రేపుతోంది. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చిన్నమ్మ రాములమ్మ సాయం అర్ధించినట్టు సమాచారం.ఎట్టి పరిస్థితుల్లో పళనిస్వామి సర్కార్ ని కూల్చి ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనలో శశి ఉన్నారట.అదే జరిగితే తమ తరపున స్టార్ కాంపైనర్ గా విజయశాంతిని పంపాలని శశికళ భావిస్తున్నారట.
ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికల టైం లో కూడా విజయశాంతి దినకరన్ తరపున ప్రచారానికి వెళ్లారు.ఇప్పుడు ఆయన విడుదల అయిన తర్వాత శశికళతో ఎక్కువ సేపు చర్చలు జరిపింది రాములమ్మే.తెలంగాణ రాజకీయాల్లో కొన్నేళ్లు కీలక పాత్ర పోషించినప్పటికీ మారిన పరిస్థితుల్లో ఇక్కడ ఆమె ప్రభావం తగ్గిపోయింది.అలాంటి సమయంలో సరైన నాయకత్వం లేని శశికళ టీం కి సారధ్యం వహిస్తే భవిష్యత్ లోనైనా మంచి అవకాశాలు రాకపోతాయా అని విజయశాంతి ఆలోచనగా వుంది. అటు సూపర్ స్టార్ రజని కూడా ఎన్నికల బరిలోకి దిగితే తన లాంటి స్టార్ మాటకు విలువ ఉంటుందని ఆమె నమ్మకం.అటు శశికళ కూడా ఇదే భావనతో విజయశాంతిని చేరదీస్తుండవచ్చు.