జయ మరణంతో సర్వస్వం లేనట్టే…..

0
539

Posted [relativedate]

sasikala crying while remembering jayalalitha after taking anna dmk party general secretaryతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో సర్వం కోల్పోయానని శశికళ భావోద్వేగానికి గురయ్యారు. అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. జయలలితను తలచుకొని కంటతడి పెట్టారు. జయలలిత మరణిస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు. 33 సంవత్సరాలు ఆమెతో కలిసి జీవించానని తెలిపారు. ఆస్పత్రిలో ఆమె ఆరోగ్యం ఒక సమయంలో మెరుగుపడిందని, అయినప్పటికీ గుండెపోటు వచ్చిందని గుర్తు చేశారు. దేశవిదేశాలకు చెందిన వైద్యులు జయలలితకు వైద్యం అందించారన్నారు. జయలలిత లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నానన్నారు.

[wpdevart_youtube]khzNa3hwVlQ[/wpdevart_youtube]

Leave a Reply