చిన్నమ్మ చిక్కిందట..

Spread the love

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sasikala is very lame
బెల్లం వున్న చోటే ఈగలు వాలతాయి.ఇందులో ఏ కొత్తదనం లేదు.కానీ రాజకీయంగా ఇక పతనమే అనుకున్న శశికళ ఉరఫ్ చిన్నమ్మ ని జైలు గోడల మధ్య చూసేందుకు మంత్రులు,ఎమ్మెల్యేలు వచ్చారు.ఇది సహజం కాదు .ఈమధ్య ఎవరూ ఆమెని చూసేందుకు రావడం లేదనుకున్నాం.ఇంతలో తమిళనాడు మంత్రులు,ఎమ్మెల్యేలు కొందరు ఆమెని జైలుకెళ్లి పలకరించడం తో ఆ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద చర్చే సాగుతోంది.ఈ పరిణామంతో రాజకీయంగా ఆమె పతనం సంపూర్ణం కాదని అర్ధం అవుతోంది.దినకరన్ అరెస్ట్ ,ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు తర్వాత యుద్ధభూమిలో ఆమె కింద పడినట్టే అనిపించింది.కానీ తాజా పరిణామంతో చిన్నమ్మ కింద పడినా ఆమె చేతిలో కత్తి కింద పడలేదు అనిపిస్తోంది.

తమిళనాడు మంత్రి బాలకృష్ణారెడ్డి,ఎమ్మెల్యేలు కరుణాస్,తంగ తమిళ్ సెల్వన్,వెట్రివేల్,మాజీ మంత్రి బీవీ రమణ తదితరులు శశికళని బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కలిసి రాజకీయ పరిస్థితులు గురించి ఆమెకి వివరించారు.ఆమె ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. దినకరన్ అరెస్ట్ తర్వాత డీలాపడ్డట్టు కనిపించిన చిన్నమ్మ మళ్లీ పుంజుకున్నారట.కాకుంటే ఆరోగ్యం అంత బాగాలేదని, ఆమె బాగా చిక్కారని ఎమ్మెల్యేలు చెబుతున్న మాట.ఇంకొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు,మంత్రులు జైలుకెళ్లి ఆమెని పరామర్శిస్తే మాత్రం చిన్నమ్మ త్వరలో కోలుకునేట్టు వున్నారు.ఆరోగ్యం సంగతి పక్కనబెడితే బీజేపీ ఎన్ని చేసినా,ఏమి చేసినా జైల్లో ఉండి కూడా చిన్నమ్మ అన్నాడీఎంకే మీద ఏదో రూపంలో తన పట్టు కొనసాగించడం విశేషమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here