శ‌శిక‌ళ స్వ‌యంకృతాప‌రాధం!!

Posted December 5, 2016

sasi
త‌మిళ‌నాడులో పురుచ్చిత‌లైవి జ‌య‌ల‌లిత అంటే ఎంత‌మందికో తెలుసో.. వారంద‌రికీ అమ్మ నిచ్చెలి శ‌శిక‌ళ కూడా ప‌రిచ‌య‌మే. ప్ర‌స్తుతం అమ్మ హాస్పిట‌ల్ లో ఉన్న త‌రుణంలో ఆమె వార‌సుడిపై చ‌ర్చ జ‌రుగుతున్న త‌రుణంలో సాధార‌ణంగానైతే శశిక‌ళ పేరు తెరపైకి రావాలి. కానీ ఎక్క‌డా అలా జ‌ర‌గ‌డం లేదు. ఇందుకు ఏకైక కార‌ణం ఆమె స్వ‌యంకృతాప‌రాధమేన‌ట‌.

గ‌తంలో జ‌య‌ల‌లితకు శ‌శిక‌ళ అంటే ప్రాణం. శ‌శికి చెప్ప‌కుండా ఆమె ఏ నిర్ణ‌యం కూడా తీసుకోలేనంతంగా ఇద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్ షిప్ ఉండేది. కానీ అక్క‌డే జ‌య నిచ్చెలి శ‌శి అతి తెలివిని ప్ర‌ద‌ర్శించింది. జ‌య‌ను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తించింది. ప్ర‌భుత్వ పాల‌న‌లో ఆమె జోక్యం పెరిగిపోయింది. దీంతో ఆమెపై కంప్ల‌యింట్స్ పెరిగాయి. జ‌య దీన్ని లైట్ గానే తీసుకున్నా… మోడీ ఇచ్చిన హింటుతో శ‌శిక‌ళ ఫేట్ మారిపోయింది. జ‌యపై విష‌ప్ర‌యోగం జ‌రిగింద‌ని… అది చేసింది శ‌శిక‌ళేన‌ని … అప్ప‌ట్లో మోడీ… ఆధారాల‌తో స‌హా వివ‌రించార‌ట‌. వాస్త‌వం తెలుసుకున్న జ‌య … శ‌శిక‌ళ‌ను బ‌య‌ట‌కు పంపించేశారు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ జ‌య‌… శ‌శిక‌ళ‌ను ద‌గ్గ‌ర‌కు తీసినా.. అప్ప‌ట్లో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు లేద‌ని చెబుతున్నారు. కేవ‌లం ఫ్రెండ్ షిప్ వ‌ర‌కే త‌ప్ప ఇత‌ర చోట్ల ఆమె పెత్త‌నం సాగ‌డం లేదు. దీంతో శ‌శిక‌ళ‌పై పార్టీ నేత‌ల ఫోక‌స్ బాగా త‌గ్గిపోయింది. ఆ ప్ర‌చారం వ‌ల్లే ఇప్పుడు జ‌య వార‌సురాలిగా శ‌శిక‌ళ పేరు హైలైట్ కావ‌డం లేదు. ఇది క‌చ్చితంగా స్వ‌యంకృతాప‌రాధం కాక‌పోతే. ఇంకేటి?

SHARE