Posted [relativedate]
అమ్మ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో పెద్ద వెలితి ఏర్పడింది. అయితే అన్నాడీఎంలో ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు నేనున్నానంటూ పావులు కదుపుతున్నారు చిన్నమ్మ శశికళ. ఇప్పటికే అమ్మను తలపించేలా పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు శశి. ఇక మిగిలింది పార్టీ బాధ్యతలను అధికారికంగా తీసుకోవడమే. ఇక్కడ ఆమె పక్కా స్కెచ్చేశారట. అటు కేంద్రాన్ని ఇటు జయ అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికి సరికొత్త ఎత్తుగడ వేశారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరు లాంఛనమేనని అంతా భావించారు. ఈ తరుణంలో తాను ఈ బాధ్యత తీసుకుంటే జయ అభిమాన నేతలు, కార్యకర్తలు తనను నిలువరించే ఛాన్స్ ఉంది. అటు కేంద్రం దృష్టిలో కూడా తాను అధికారం కోసం వెంపర్లాడుతున్నాననే ముద్ర పడుతుంది. అందుకే వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు శశికి బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నిజానికి అన్నాడీఎంకేలో శాశ్వత ప్రధాన కార్యదర్శి పదవి లేదు. జయ అభిమానులను శాంతింపజేసేందుకు ఆ పదవిని సృష్టించాలన్న ఆలోచనను తెరపైకి తెచ్చింది. పార్టీ నాయకులకు ఈ ఆలోచనను వివరించింది. దీనికి పార్టీలోని వర్గాలకతీతంగా అందరూ జై కొట్టారు. అటు ఢిల్లీ పెద్దలు కూడా శశి మంచి ఆలోచన చేసిందని మెచ్చుకున్నారట. దీంతో త్వరలోనే దివంగత జయలలితను అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా నియమించబోతున్నాట. ఇక ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు తీసుకుంటారట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వస్తుందని చెబుతున్నారు.
నిన్నమొన్నటిదాకా తనపై విమర్శలు వచ్చిన తరుణంలో జయనిచ్చెలి వేసిన ప్లాన్ పక్కాగా వర్కవుట్ అయ్యింది. ఒకే దెబ్బకు అటు జయ వర్గాన్ని.. ఇటు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం చిన్నమ్మకే చెల్లిందని చెప్పుకుంటున్నారు అన్నాడీఎంకే నాయకులు.