చిన్నమ్మని చించేశారు..ఆ మాఫియాకి దారేది?

0
583
sasikala posters tearing in AIADMK mannargudi mafia shocked

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sasikala posters tearing in AIADMK mannargudi mafia shocked
అమ్మ పోయినా తాను అనుకున్నట్టు పార్టీ పగ్గాలు చేపట్టిన చిన్నమ్మకి ఇక అన్నాడీఎంకే లో నూకలు చెల్లిపోయాయి.ఆమె మోడీ ప్రభుత్వాన్ని కాదనుకుని సీఎం పీఠం ఎక్కించిన పళనిస్వామి,ఆమె చేత అవమానకరంగా అదే కుర్చీ నుంచి దిగిపోయిన పన్నీర్ సెల్వం కలిసి చిన్నమ్మని పార్టీ నుంచి దిగ్విజయంగా సాగనంపారు.ఆమె మేనల్లుడు దినకరన్ అరెస్ట్ వార్త తెలిసిన కొద్ది గంటల్లోనే చెన్నై అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో చిన్నమ్మ పోస్టర్లు చించి పడేసారు.ఆ చిత్రాలు తీసిపడేశాకే రెండువర్గాల విలీనం సాధ్యమని షరతు పెట్టిన పన్నీర్ సెల్వం తన మాట నెగ్గించుకున్నారు.

అన్నాడీఎంకే కార్యాలయంలో చిన్నమ్మ పోస్టర్లు చినిగిన వెంటనే మన్నారు గుడి మాఫియా లో వణుకు మొదలైంది.పోయెస్ గార్డెన్ ఖాళీ చేయాల్సి రావడం తప్పదని అర్ధమైంది.అయితే ప్రస్తుతానికి చేతికి చిక్కింది దక్కించుకుని దారి చూసుకుందామని మన్నార్ గుడి మాఫియా లో కీలక సభ్యులు అనుకుంటున్నారు.అయితే ఆ దారి కూడా మూసుకుపోయిందని వారికి అర్ధమైంది.వారి అక్రమాలు,అరాచకాలు,ఆస్తిపాస్తుల చిట్టాలు,జయ ఆస్తుల పత్రాలు..ఇలా అన్నిటి సమాచారాన్ని దగ్గరపెట్టుకున్న పోలీసులు ఎప్పుడు ఆదేశం వస్తే అప్పుడు మన్నార్ గుడి మాఫియా మీద విరుచుకుపడేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.అన్ని దారులు మూసుకుపోయిన ఈ మాఫియా ని చూస్తుంటే అధికారాంతమందు చూడాలి అయ్యల పాట్లు అన్న విషయం గుర్తుకు వస్తోంది.

Leave a Reply