పన్నీర్ ని పట్టుకుని కొట్టారా ?

0
491
sasikala relatives beaten to o panneerselvam

Posted [relativedate]

sasikala relatives beaten to o panneerselvamపన్నీర్ సెల్వం…వినయవిధేయతలకి ఓ రూపం వస్తే ఆయనలా ఉంటుందనిపిస్తుంది.అలాంటి పన్నీర్ ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు ఒంగిఒంగి దండాలుపెట్టిన శశికళతో ఢీకొడుతున్నారు. ఆమెకి చెమటలు పట్టిస్తున్నారు.ఇంతలో అంత మార్పు ఎలా వచ్చింది?అసలు ఏమి జరిగి ఉంటుంది ? చిన్నమ్మ మీద పగబట్టినట్టు రాజకీయపోరాటానికి దిగడం వెనుక కారణమేంటి? ఇన్నాళ్లు రహస్యంగా వున్న ఆ విషయం చూచాయగా బయటకు వచ్చింది.అయితే అది నమ్మకశ్యంగాని నిజం.

ఓ రాష్ట్రానికి సీఎం గా వున్న పన్నీర్ సెల్వాన్ని పట్టుకుని కొట్టారట.రాజీనామా చేయమని బెదిరించారట.అంతగా బరితెగించింది శశికళ బంధువులట.పోయెస్ గార్డెన్ లో చిన్నమ్మ కనుసన్నల్లో ఈ దారుణం జరిగిందట.ఈ విషయం బయట పెట్టింది పన్నీర్ సెల్వం కి దగ్గరగా మెసిలిన అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు మధుసూదన్.సెల్వం,శశికళతో పాటు జయలలితకు కూడా సన్నిహితుడైన మధుసూదన్ స్వయంగా ఈ విషయం బయటపెట్టారు.ఇక పార్టీ పగ్గాలు శశికళకి అప్పగించడానికి చొరవ చూపినవారిలో మధుసూదన్ ఒకరు.ఆమె పార్టీ వరకు ఓకే గానీ సీఎం పదవి చేపట్టేందుకు పనికిరాదని కూడా మధుసూదన్ చెప్పారు.పన్నీర్ ని కొట్టిన విషయం తెలియగానే ఇక శశికళ కి దూరంగా వుండాలని మధుసూదన్ నిర్ణయానికి వచ్చారట.

మధుసూదన్ తరహాలోనే తాజాగా శశికళ క్యాంపు కి చెందిన ఇద్దరు ఎంపీలు,ఓ రాష్ట్ర మంత్రి పన్నీర్ కి మద్దతు ప్రకటించారు.విద్యాశాఖామంత్రి పాండిరాజన్ ట్విట్టర్ ద్వారా ప్రజలు వున్న వైపే తానూ ఉంటానని ప్రకటించారు.

Leave a Reply