అమ్మతోడు.. సీఎం అవుతానంటున్న చిన్నమ్మ!!

0
341
sasikala said i will come to assembly when i become chief minister

Posted [relativedate]

sasikala said i will come to assembly when i become chief minister
తమిళనాడు అసెంబ్లీలో అప్పట్లో జయలలితకు పరాభవం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న ఆమెను అధికారపార్టీ అవమానించింది. దీంతో జయ అప్పట్లో శపథం చేశారు. సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ ప్రతినబూనారు. అనుకున్నట్టుగానే ఆమె సీఎం అయిన తర్వాతే శాసనసభలో కాలుమోపారు. ఇప్పుడు అన్నాడీఎంకే చీఫ్ చిన్నమ్మ కూడా అమ్మ లెవల్లో ఒక ప్రతిజ్ఞ చేశారట.

ఈనెల 23న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అసెంబ్లీకి వస్తారని భావించారు. వీఐపీ గ్యాలరీలో కూర్చొని… అసెంబ్లీ లైవ్ ను తిలకిస్తారని ఆశించారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి అసెంబ్లీ కావడంతో… ఆమె వస్తారని ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా పార్టీ శాసనసభ్యులంతా భావించారు. కానీ సీన్ మారింది. చిన్నమ్మ రాలేదు.

గణతంత్ర వేడుకల్లోనూ శశికళ పాల్గొనలేదు. రిపబ్లిక్ డే వేడుకల కోసం ఆహ్వానం అందినా ఆమె దూరంగా ఉండిపోయారు. ప్రభుత్వం శశితో పాటు ఆమె బంధువర్గానికి కూడా వీవీఐపీలు పాసులు జారీ చేసిందట. కానీ ఈ సెలబ్రేషన్స్ లోనూ ఆమె పాల్గొనలేదు.

ఈ రెండు కార్యక్రమాల్లోనూ చిన్నమ్మ పాల్గొనకపోవడమే ఆమె చేసిన శపథమే కారణమని టాక్. సాధారణంగా అధికారిక కార్యక్రమాల్లో .. ప్రోటోకాల్ విషయంలో ముందు సీఎంగా పన్నీర్ సెల్వంకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత మంత్రులకు ఛాన్స్ ఉంటుంది. కానీ శశికళ మాత్రం ప్రభుత్వంలో భాగస్వామి కాదు. ఆమెకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే తాను సీఎం అయ్యే వరకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోనని ప్రతిజ్ఞ చేశారట చిన్నమ్మ.

ఈ ప్రతిన చూస్తుంటే… శశికళ సీఎం పదవి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సాధ్యమైనంత తొందరగా సెల్వంకు చెక్ చెప్పి… సీఎం సీటులో కూర్చోవడానికి చిన్నమ్మ తొందరపడుతున్నారట. కానీ పరిస్థితులు ఆమె కలిసి రావడం లేదని చెబుతున్నారు. మరి చిన్నమ్మ సీఎం కల నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాలి.

Leave a Reply