ప‌న్నీరే న‌య‌మంటున్న చిన్న‌మ్మ‌!!

0
232
sasikala says panneerselvam better than palaniswamy

Posted [relativedate]

sasikala says panneerselvam better than palaniswamy
కేంద్రంతో తుదిదాకా పోరాడి ప‌ళ‌నిస్వామిని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టిన చిన్న‌మ్మ ఇప్పుడు అత‌నిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప‌ళ‌ని కంటే పన్నీరే బెట‌రని త‌న స‌న్నిహితుల‌తో చెప్పిన‌ట్టు టాక్. ఎందుకంటే ప‌ళ‌ని కోసం ఇంత త్యాగం చేస్తే … అత‌ను మాత్రం ఇప్ప‌టిదాకా చిన్న‌మ్మ‌ను క‌నీసం ప‌రామ‌ర్శించ‌డానికైనా రాలేదు.

నిజానికి ప‌ళ‌నిస్వామికి ముఖ్య‌మంత్రి అయ్యేంత బ‌లం లేదు. అయిన‌ప్ప‌టికీ చిన్న‌మ్మ ద‌య వ‌ల్లే ఆయ‌న సీఎం కాగ‌లిగాడు. కానీ సీటు ఎక్కిన త‌ర్వాత ప‌ళ‌నిలోని అస‌లు స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. త‌న‌కు ఇంత పెద్ద ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన చిన్న‌మ్మ‌ను ఆయ‌న మ‌రిచిపోయాడు. ఇప్ప‌టిదాకా జైలులో ఉన్న శ‌శిక‌ళ‌ను ప‌రామ‌ర్శించిన పాపాన పోలేదు. అంతేకాదు ఎవ‌రైనా చిన్న‌మ్మ పేరు తీస్తే చాలు ప‌ళ‌నికి ఒక్క‌సారిగా కోప‌మొచ్చేస్తోంద‌ట‌. ఈ విష‌యం ఆ నోటా… ఈ నోటా చివ‌రికి శ‌శిక‌ళ దాకా వెళ్లింద‌ని టాక్.

క‌నీసం జైలుకు వ‌చ్చి ఓదార్పు కూడా ఇవ్వ‌ని ప‌ళ‌నిస్వామి.. త‌న‌కు వ్య‌తిరేకంగా నోరుజార‌డంపై శ‌శిక‌ళ చాలా ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. ఇంత వెన్నుపోటు పొడుస్తాడ‌ని ఊహించ‌లేద‌ని వాపోతున్నార‌ట‌. అత‌ని కోసం అన్నీ త్యాగం చేసి… జైలు పాలైతే అత‌ను మాత్రంత‌న‌ను లైట్ తీసుకోవడాన్ని ఆమె స‌హించ‌లేక‌పోతున్నార‌ని స‌మాచారం. అందుకే ఈ ప‌ళ‌ని కంటే ఆ ప‌న్నీర్ సెల్వ‌మే బెట‌ర్ అని చెబుతున్నార‌ట‌.

ప‌ళ‌నిస్వామికి ఇంకో నెల‌రోజుల టైం ఇచ్చి… మ‌రో స్కెచ్ వేసేందుకు చిన్న‌మ్మ రెడీ అవుతున్నార‌ట‌. మెల్లిగా ప‌ళ‌నికి చెక్ పెట్టి… ఆ స్థానంలో దిన‌క‌ర‌న్ ను సీటు ఎక్కించాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే జైలులో ఉన్న చిన్న‌మ్మ‌కు… బ‌య‌ట అధికారంలో ఉన్న ప‌ళ‌నిని తొల‌గించ‌డం అంత ఈజీనా అన్న‌దే ఇప్పుడు క్వ‌శ్చ‌న్ మార్క్. అయినా ఇప్పుడు అనుకొని ఏం లాభం. జ‌రగాల్సిన న‌ష్టం ఇప్ప‌టికే జ‌రిగిపోయింది. కొత్త‌గా ప‌ళ‌ని అయినా.. దిన‌క‌ర‌న్ అయినా సొంతంగా చిన్న‌మ్మ‌కు జ‌రిగే ల‌బ్ధి ఏమీ ఉండ‌దు. ఆ విష‌యం శ‌శిక‌ళ‌కు కూడా తెలియ‌నిది కాదు!!!

Leave a Reply