మోడీని శశికళ ఢీకొట్టబోతున్నారా?

Posted December 8, 2016

sasikala vs modi in tamil nadu politics
అమ్మ కన్నుమూత తర్వాత తమిళనాడులో అధికార మార్పిడి సజావుగా సాగిందనుకుంటున్న వారికి షాక్ తగిలే పరిణామం ఇది. ప్రభుత్వ పగ్గాలు పన్నీర్ సెల్వానికి, పార్టీ పగ్గాలు శశికళకి అప్పజెప్పిన కేంద్ర పెద్దల్ని శశికళ ఢీకొట్టబోతున్నారా. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనే మోడీని ఢీకొట్టడానికి ఆలోచిస్తున్న వేళ శశికళ ఆయన్ని సవాల్ చేయబోతున్నారా? ఇందుకు ఔననే సమాధానం రాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

దానికి తొలి సంకేతంగా చెన్నై సహా తమిళనాడులోని ప్రధాన ప్రాంతాల్లో శశికళని ముఖ్యమంత్రి చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదనిపిస్తోంది.అన్ని పట్టణాల్లో ఒకే టైం లో..ఒకే రకమైన పోస్టర్లు వెలవడం ఓ వ్యూహం ప్రకారం జరిగి ఉంటుందనడంలో సందేహం లేదు.అంటే ఓ రకంగా చూస్తే మోడీని ఢీకొట్టడానికే శశికళ నిర్ణయించుకున్నట్టుంది. తమిళనాడులో అధికార మార్పిడికి మోడీకి సంబంధమేందన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం..

అపోలో కేంద్రంగా అధికార మార్పిడి మీద జరిగిన వ్యవహారంలో కేంద్రం అంటే మోడీ ఆదేశాలకు అనుగుణంగా శశికళ వర్గానికి బ్రేక్ పడినట్టు వార్తలు తమిళనాట గుప్పుమంటున్నాయి.పలు జాతీయ పత్రికలు,సోషల్ మీడియా లోను దాన్ని బలపరిచే కధనాలు వచ్చినా ఇటు బీజేపీ శ్రేణులు గానీ అటు అన్నాడీఎంకే శ్రేణులు గానీ నోరు విప్పలేదు.పైగా తాజా పోస్టర్ల ఎపిసోడ్ లోపల ఏదో జరిగిందన్నదానికి సంకేతమే.మొత్తంగా చూస్తే తమిళనాట అధికార మార్పిడి అనుకున్నంత చల్లగా సాగలేదని …ఇక సాగబోదని కూడా అర్ధమవుతోంది.అయితే సీఎం పీఠం కూడా లేకుండా ఓ పార్టీ అధ్యక్షురాలిగా మోడీ ని ఢీకొంటే మాత్రం శశికళకి తీరని నష్టం తప్పదు. కానీ జయ స్పూర్తితో పోరాడితే తెర వెనుక మాత్రమే కాకుండా ప్రజాక్షేత్రం లోను ఆమె నాయకురాలిగా ఆవిర్భవించవచ్చు.

SHARE