ఏపీపై చిన్నమ్మ కన్ను!!

Posted January 11, 2017

sasikala want celebrate mgr birthday in ap karnataka and tamilnaduఏపీకి చిన్నమ్మకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. అలాగని ఇక్కడ ఆమెకు ఆస్తులు- అంతస్తులు అంతకన్నా లేవు. కానీ పార్టీపై బలం పెంచుకునే క్రమంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది చిన్నమ్మ. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లోనూ అన్నాడీఎంకేను విస్తరించే ఆలోచన జరుగుతోందట.

ఈనెల 17న ఎంజీఆర్ ఎంజీఆర్ శతజయంతి జరగనుంది. ఈ వేడుకలను తమిళనాడులోని అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ జరపాలని నిర్ణయం తీసుకున్నారట. ఏపీతో పాటు కర్ణాటక, ముంబై, ఢిల్లీలో ఈ వేడుకలను జరపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమిళనాడులో అంటే అర్థముంది…కానీ పక్కరాష్ట్రాల్లో సెలబ్రేషన్స్ నిర్వహించడం వెనక బలమైన కారణం ఉందని టాక్.

ప్రస్తుతం అన్నాడీఎంకే సంధి కాలాన్ని ఎదుర్కొంటోంది. పార్టీలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం చిన్నమ్మ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తమిళనాడుతో పాటు పక్కరాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరిస్తున్నానని అన్నాడీఎంకే శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించే ఆలోచన ఉన్నట్టు సంకేతాలిస్తున్నారు. అదే సమయంలో తన వైరి వర్గాన్ని మాట మాట్లాడనీయకుండా ఈ స్కెచ్ వేశారట శశికళ.

ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీని ఆదర్శంగా తీసుకుంటున్నారు చిన్నమ్మ. టీడీపీలా అన్నాడీఎంకేను జాతీయపార్టీగా చేస్తానని పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో చెప్పుకొస్తున్నారట. ఏపీ లాంటి చోట ఎంజీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహించి మొత్తానికి జాతీయ స్థాయిలో మార్కులు కొట్టేదామనే పెద్ద ప్లాన్ లో శశికళ ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ విస్తరణ వరకు ఓకే గానీ… ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధమైతే చిన్నమ్మకు షాక్ తప్పదంటున్నారు అన్నాడీఎంకే అసంతృప్త నాయకులు. మొత్తం ఇంట గెలిచి ఆ తర్వాత రచ్చ గెలవాలని స్పష్టం చేస్తున్నారు.

SHARE