Posted [relativedate]
నాలుగేళ్ల శిక్ష అనుభవించడానికి బెంగళూరు పరప్పణ అగ్రహారం జైల్లో అడుగుపెట్టిన చిన్నమ్మ మళ్లీ చెన్నైలో అడుగుపెట్టేందుకు మాస్టర్ స్కెచ్ వేసింది.దీనికోసం పక్కా ప్లాన్ ఇప్పటికే అమలవుతోంది. పళనిస్వామి తమిళనాడు సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన రోజు రాత్రికే శశికళ భర్త బెంగళూరు చేరుకున్నారు.దాదాపు 30 మంది ఉద్దండులైన న్యాయవాదులతో శశికళని చెన్నై జైలు కి షిఫ్ట్ చేసే ప్లాన్ గురించి మధనం చేశారు.ఆ చర్చల నుంచి ఓ ఐడియా పుట్టింది.శశికళకి బెంగళూరు లో ప్రాణాపాయం ఉన్నందున ఆమెని చెన్నై తరలించాలని కోర్ట్ లో పిటీషన్ వేయాలని నిర్ణయించారు. నిన్న మధ్యాహ్నం అనుకున్నట్టే బెంగళూరు ప్రత్యేక కోర్ట్ లో పిటీషన్ వేశారు. తమ వాదనకు బలం చేకూరేలా తమిళనాడు ఇంటలిజెన్స్ ని రంగంలోకి దించారు.ఆ విభాగపు అధికారులు శశి శిక్ష అనుభవిస్తున్న జైలుకి వెళ్లి చిన్నమ్మకి వివిధ వర్గాల నుంచి ప్రాణ భయం ఉన్నందున భద్రత అంశంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.దీనిపై ఓ నివేదిక కూడా అందజేశారు.
ఆ నివేదిక ఆధారంగా కోర్ట్ లో శశికళ తరలింపు గురించి వాదించే అవకాశముంది.అయితే బెంగళూరు జైలు అధికారులు,కర్ణాటక హోమ్ శాఖ ఇచ్చే నివేదిక కూడా కీలకమే.ఆ నివేదిక అనుకూలంగా వస్తే శశి తిరిగి చెన్నై లో అడుగుపెడుతుంది.తమిళనాడు ప్రభుత్వ అజమాయిషీలో నడిచే జైల్లో చిన్నమ్మకి రాజభోగాలు రెడీగా వుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.