Posted [relativedate]
టవర్ ఉంటేనే సిగ్నిల్ లేకపోతే అవుటాఫ్ కవరేజ్.. ఇప్పటి వరకు మనం చూసింది ఈ తరహా స్మార్ట్‌ఫోన్ వాడమే.. తాజాగా చైనా కొత్త సంచనాలకు తెర తీసింది. శాటిలైట్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ టియాన్‌టాంగ్-1(టీటీ-1)ని ఆవిష్కరించింది. దీనికి సెల్ టవర్‌తో పనుండదు.. నేరుగా శాటిలైట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఇటువంటి ఫోన్లు దేశభద్రత కోసం.. దేశనాయకులు వాడుకునేందుకు వాడుతుంటారు..
ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నంలోనే తొలి అడుగు చైనా వేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గ్వాంగ్‌డాంగ్‌లోని ఝహాయ్‌లో జరుగుతన్న ఎయిర్‌షోలో దీన్ని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా పనిచేయడంతోపాటు వివాదాస్పద దక్షిణ సముద్ర జలాల ప్రాంతంలోనూ పనిచేయడం దీని ప్రత్యేకత… దీన్ని బట్టి చైనా పెద్ద ప్లాన్‌తోనే ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.