Posted [relativedate]
నందమూరి నటసింహం బాలయ్య ప్రతిష్టాత్మక 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ ఈ సాయంత్రం 5 గంటలకి తిరుపతిలో జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫంక్షన్ ని విజయవంతం చేయడంతో పాటు ..ఇప్పటికే మార్మోగుతున్న శాతకర్ణి కి ఇంకా హైప్ తెచ్చేందుకు చిత్ర యూనిట్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో హైలైట్ గా నిలిచే కొన్ని అంశాలు ఇవే ..
- గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు,కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొంటారు.
- మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు, ఎంపీ హేమ మాలిని కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకోబోతున్నారు.
- శాతకర్ణి ఆడియో ఫంక్షన్ ఈవెంట్ నిర్వహిస్తున్న జె మీడియా టెక్నికల్ గా కొన్ని అద్భుతాలు చేయబోతోంది.తొలిసారిగా ఓ ఆడియో ఫంక్షన్ వేదికపై 100 అడుగుల ఎల్.ఈ.డీ ఏర్పాటు చేస్తున్నారు.
- భారత దేశం మొత్తం మీద ఉన్న రెండే రెండు అత్యంత విలువైన,అరుదైన స్టీరియో స్పీకర్ సిస్టం లలో ఒకదాన్ని శాతకర్ణి కోసం వాడుతున్నారు.
- ఆడియో వేదిక మీద జరిగే కార్యక్రమాల కోసం ముంబై నుంచి ఓ ప్రత్యేక బృందం వస్తోంది.
- కథాకళి నృత్య ప్రదర్శన ఒకటి ఫంక్షన్ మొత్తానికి హైలైట్ అయ్యేలా రూపకల్పన చేశారు.
- సింహా చిత్రం లోని ఓ పాటని ఈ వేదిక మీద ప్రదర్శిస్తారు.
- శాతకర్ణి ఆడియో ఫంక్షన్ కోసం అవసరమైన అత్యున్నత సాంకేతిక సామాగ్రి తరలింపుకు దాదాపు 75 లక్షలు ఖర్చు అయినట్టు తెలుస్తోంది.