గౌతమీపుత్ర శాతకర్ణి సెన్సార్ టాక్ …

0
361
sathakarni sensor talk

Posted [relativedate]

sathakarni sensor talk
గౌతమీపుత్ర శాతకర్ణి సీన్స్ చూసిన సినీ ప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వర్మ లాంటి వాళ్ళు ఓ గంట సినిమా చూసేసి గంటల కొద్దీ దర్శకుడు క్రిష్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఈ టైం లో గౌతమీపుత్ర శాతకర్ణి సెన్సార్ పూర్తి అయింది.ఈ సినిమాకి యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా గురించి ఏమి చెప్పారంటే ..

గౌతమీపుత్ర శాతకర్ణి షో మొదలుకాగానే సెన్సార్ బోర్డు సభ్యుల కళ్ళు ఆశ్చర్యంతో విప్పారినాయంట. అప్పుడు మొదలైన భావోద్వేగ ప్రయాణం ఆ కళ్ళలో ఎన్నెన్నో భావాలు పలికించాయి . పెదాలపై చిరు మందహాసాలు ఓ సారి …జివ్వున నరాల్లో ఉప్పొంగిన నెత్తురు మరోసారి..బరువెక్కిన హృదయపు సడి ఇంకోసారి …చిట్టచివరికి ఓ అద్భుతాన్ని చూసిన కళ్ళలో కనిపించే సంతృప్తి …ఆ సంతృప్తిని కోట్లాది మంది ప్రేక్షకుల కన్నా ముందే పొందిన అదృష్టాన్ని తల్చుకుంటూ ..వుయ్ అర్ లక్కీ …వాట్ ఏ మూవీ ..ప్రైడ్ అఫ్ తెలుగు సినిమా అన్న మాటలు పదేపదే వినిపించాయి. శాంతి కోసం జరిగిన యుద్ధాన్ని …దాన్ని జరిపించిన యోధానుయోధుడిని చూసిన తరువాత ఎవరైనా ఇంతకు మించి ఏమంటారు?

Leave a Reply