బాలయ్య ట్రైలర్ రికార్డ్.. మెగాస్టార్ సాంగ్ తోనే ఊడ్చేశాడు..!

0
544
Sathakarni Trailer Record Breaks Chiru Khaidi Song

Posted [relativedate]

Sathakarni Trailer Record Breaks Chiru Khaidi Song

మెగాస్టార్ స్టామినా ఇది అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్టామినా ఇతర భాషలకే కాదు అప్పట్లోనే విదేశాలకు చాటి చెప్పిన ఘనత మెగాస్టార్ చిరంజీవిది. అయితే 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఖైది నెంబర్ 150 సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. ఇక అదే టైంలో నందమూరి బాలకృష్ణ వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఓ రేంజ్లో ఉంటుందని చెప్పాలి.

చరిత్ర ఆధారంగా వస్తున్న శాతకర్ణి ట్రైలర్ ఇప్పటికే సంచలనాలను సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 2.13 మిలుయన్ వ్యూస్ సంపాదించి వారెవా అనిపించాడు బాలయ్య. అయితే ఇక మెగాస్టార్ ఖైది సినిమాలోని సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. అది కూడా ఒక్కరోజులోనే 22 లక్షల వ్యూస్ వచ్చాయి. సో టీజర్ ట్రైలర్ సాంగ్స్ నుండి నువ్వా నేనా అన్న పోటీ ఈ రెండు సినిమాల మధ్య మెగా నందమూరి వార్ జరుగుతుంది.

అయితే బాలయ్య ట్రైలర్ తో రికార్డ్ నెలకొలిపితే మెగాస్టార్ మాత్రం కేవలం సాంగ్ అది కూడా ఫోటో షూట్ ఉన్న సాంగ్ తోనే ఆ రికార్డ్ క్రాస్ చేయడం మెగాస్టార్ స్టామినా ఏంటో తెలియచేస్తుంది. పోటీ ఎలా ఉన్న క్రేజ్ పరంగా రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి. మరి ఈ బరిలో ఎవరు విజయకేతనం ఎగురవేస్తారో చూడాలి.

Leave a Reply