సావిత్రి …స్మిత కాదు నిత్య?

 savithri biopic movie role act nithya menan not vidhyabalan
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఇంకాస్త ముందుకెళ్లాయి.ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ డైరెక్టర్ సావిత్రి జీవిత కథని తెరకెక్కించడానికి పూనుకున్నాడు.అయితే ప్రధాన పాత్ర కోసం డర్టీ పిక్చర్ లో స్మిత రోల్ వేసిన విద్యాబాలన్ అనుకున్నారు.ఆమె దాదాపు కన్ఫర్మ్ అనుకున్న దశలో కొత్తపేరు వినిపిస్తోంది.నటన పరంగా తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న మలయాళీ అమ్మడు నిత్యమీనన్ ని దర్శకుడు సంప్రదించినట్టు ఆమె కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ వార్తలు బయటకి వస్తున్న సమయంలోనే మరో రూమర్ మలయాళ సినీ రంగంలో బలంగా వినిపిస్తోంది.సావిత్రి ఓ వివాహితుడి ప్రేమలోపడి పెళ్లిచేసుకున్నట్టే నిత్య కూడా ఓ పెళ్ళైన హీరోతో క్లోజ్ గా మూవ్ అవుతోందట .ఇంతకీ ఆయనెవరో కాదు..మమ్ముట్టి కొడుకు ..సల్మాన్ దుల్కర్ ..ఈ ఇద్దరు కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.అప్పుడు ఏర్పడ్డ పరిచయం ఇంకెక్కడికో దారి తీసిందని టాక్ .అయితే తాను ఎవరితో నటించినా వారితో కలిపి పుకార్లు పుట్టిస్తున్నారని నిత్య మండిపడుతోంది.

SHARE