సావిత్రి యంగ్ హీరోయిన్ …మరి సమంత?

0
506
savitri biopic movie lead role keerthy suresh samantha special character

Posted [relativedate]

savitri biopic movie lead role keerthy suresh samantha special character
మహానటి సావిత్రి జీవిత కధ ఆధారంగా నాగ్ అశ్విన్ తీస్తున్న బయోపిక్ లో లీడ్ రోల్ కీర్తి సురేష్ చేస్తోందని ప్రొడ్యూసర్ అశ్వనీదత్ చెప్పేశారు. అయితే ఈ సినిమాలో సమంత కూడా చేస్తోందని ఆమె పాత్ర సావిత్రిని దగ్గరుండి నడిపిస్తుందని కూడా అయన వెల్లడించారు.దీంతో ఫిలిం సర్కిల్స్ లో ఒకటే చర్చ …సావిత్రి జీవితంలో అంత ముఖ్యమైన మహిళ ఎవరా అని? అయితే స్క్రీన్ ప్లే లో ఉన్న భిన్నత్వం రీత్యా వర్తమాన అంశాలని లేదా ప్రస్తుత నటీమణుల జీవితాన్ని ఆ మహానటి వ్యవహారశైలి పోల్చి చూశారేమో అన్న ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి.ఏదేమైనా సావిత్రి లో లీడ్ రోల్ కాకపోయినా సమంత ఇంకో పాత్ర కి ఒప్పుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.అంత ప్రాధాన్యం కలిగిన పాత్ర ఏంటనే ఆసక్తే సినిమాకి బలం కావచ్చు.

ఇక సావిత్రి సినిమాలో ఎన్టీఆర్,anr ,జెమినీ గణేశన్ పాత్రలకి ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.తెలుగు చలన చిత్ర రంగంలో ఈ తరహాలో ఓ నటీమణి జీవితాన్ని తెరకెక్కించడం దాదాపు తొలిసారి అని చెప్పుకోవచ్చు.ఈ ప్రయత్నం ఫలిస్తే తెలుగులోనూ బయోపిక్ ల సీజన్ నడుస్తుంది.ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి మంచి చిత్రం తీసిన నాగ్ అశ్విన్ దర్శకుడు కావడంతో సావిత్రి మీద కూడా ఓ తరహా ప్రేక్షకుల్లో స్పెషల్ ఆసక్తి కనిపిస్తోంది.

Leave a Reply