అప్పు ఎగ్గొట్టినోళ్లకి పండగ…

Posted November 16, 2016

sbi writes off rs 7016 crore loans owed by wilful defaultersఒక వైపు నల్లధనం పై పోరాడతామంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బడా పెట్టుబడిదారులకు చెందిన సుమారు 7100 కోట్ల రూపాయలను మొండి బకాయిలుగా ప్రకటించి రద్దుచేసింది.కేంద్ర ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాలను రద్దు చేసింది.బ్యాలెన్స్ షీట్ నుంచి మొండి బకాయిల ఖాతా లేకుండా చేయడం కోసం వాటిని రద్దు చేసింది.ఇందుకోసం అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అక్కౌంట్స్ అనే పద్దతిని అవలంభించిందట. దీని ప్రకారం మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన అకౌంటులోకి బదిలీ చేస్తారట. తద్వారా ముందుగా అవి బ్యాంకు బ్యాలెన్సు షీటులో కనిపించకుండాపోతాయి. దాని ద్వారా బ్యాంక్ పనితీరు మెరుగుపడినట్లు అవుతుందని చెబుతున్నారు. విజయ్ మాల్యకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీతో పాటు కొన్ని తెలుగు రాష్ట్రాల కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.మొత్తం అరవైమూడు కంపెనీలు వీటిలో ఉన్నాయి.

కింగ్ ఫిషర్ కు 1201 కోట్ల బాకీ రద్దు అయింది.

ఆంద్రప్రదేశ్ లో మొండి బకాయిలు ఉన్న కంపెనీలు

విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రూ.93.91 కోట్లు
విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ లిమిటెడ్ రూ. 66.57 కోట్లు
కెఆర్ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు రూ. 86.73 కోట్లు
ఘన్ శ్యాం దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ రూ.61.72 కోట్లు

తెలంగాణ
తోటెం ఇన్ ఫ్రా లిమిటెడ్ రూ. 93.68కోట్లు
ఎస్ఎస్‌బీజీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ రూ.65.24 కోట్లు

వీటితోపాటు కేఎస్ ఆయిల్ (రూ 596 కోట్లు), సూర్య ఫార్మాస్యూటికల్స్ (రూ 526 కోట్లు) జీఈటీ పవర్, (రూ .400 కోట్లు) సాయి అండ్ ఇన్ఫో సిస్టమ్ (రూ 376 కోట్లు) ఉన్నాయి.

SHARE