వైసీపీ కి ఆ వర్గాలు దూరం?

0
590
sc and st caste category people going to ysrcp party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sc and st caste category people going to ysrcp party
వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కి అండదండగా నిలబడినవర్గాల్లో ఎస్సీలు ముఖ్యులు. మత ప్రభావమో,ఆది నుంచి వెళుతున్న రాజకీయ మార్గమో…కారణం ఏదైనప్పటికీ ఎస్సీలు ఆ పార్టీ కొమ్ముకాశారు.2014 లో వైసీపీ ఓటమి తర్వాత టీడీపీ,బీజేపీ తీసుకున్న వ్యూహాత్మక ఎత్తుగడలతో ఆ పార్టీ ఓటు బ్యాంకు కి భారీగా గండి పడింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణకు గట్టి మద్దతుదారుగా వున్న టీడీపీ ప్రాధాన్యం మారిపోయింది.విభజిత ఆంధ్రప్రదేశ్ లో లెక్కల ప్రకారం మాదిగలతో పాటు మాలల్ని ఆకట్టుకోలేకపోతే రాజకీయ మనుగడ అసాధ్యమని గుర్తించిన చంద్రబాబు స్టాండ్ మారింది.పదవుల విషయంలో మాదిగల కన్నా మాలల ప్రాధాన్యం పెరిగింది.వైసీపీ కి అండగా వున్న ఆ వర్గాన్ని ఆకట్టుకోడానికి జూపూడి,కారెం వంటి వారిని బాబు దగ్గరకు తీశారు.ఆ వ్యూహం ఫలిస్తున్నంతలో క్యాబినెట్ పదవి కూడా అదే వర్గానికి చెందిన నక్కా ఆనందబాబు కి ఇవ్వడం ద్వారా ఆ వర్గాన్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచారు.

ఈ పరిణామాలతో అసంతృప్తికి లోనైన మాదిగలు వర్గీకరణ అంశంలో గట్టి మద్దతుదారు కోసం ఎదురుచూసినా వైసీపీ ఆ పాత్ర నిర్వహించలేకపోయింది.అదే సమయంలో మత పరమైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మాదిగల వర్గీకరణ డిమాండ్ పట్ల బీజేపీ పూర్తి సానుకూలత ప్రదర్శించింది.ముఖ్యంగా వెంకయ్యనాయుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాదిగలని ఎంతోకొంత ఆకట్టుకోగలిగారు,ఈ పరిణామాలతో పాటు ఇటీవల మోడీ తో జగన్ భేటీ తర్వాత ఆయనలోని పోరాట యోధుడిని కాక ఫక్తు రాజకీయ నేతని చూసిన ఎస్సీలు సహజంగానే ప్రత్యామ్న్యాయం చూసుకుంటున్నారు.ఒక అంశం మీద తీసుకున్న నిర్ణయాలతో ఎస్సీల్లో టీడీపీ, బీజేపీ బలం పెంచుకుంటే వ్యూహాత్మకంగా వ్యవహరించలేక ఆ వర్గాలకు వైసీపీ దూరం అవుతోందని ఆ పార్టీ నేతలే బాధపడుతున్నారు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ టూర్ నుంచి వచ్చాక జగన్ తో ప్రత్యేకంగా ప్రస్తావించాలని కొందరు సీనియర్లు భావిస్తున్నారు.ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎంత ప్రయాజనముంటుంది?

Leave a Reply