నిరుద్యోగ భృతి.. ఎవరికివ్వాలి..? ఎలా ఇవ్వాలి..?

0
607
schemes for unemployment students

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

schemes for unemployment studentsసార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీల్లో భాగంగా కీలకమైన నిరుద్యోగులకు భృతి చెల్లించాల్సి విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత…ఇటీవల బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతిపై ప్రస్తావన వచ్చింది. అయితే మార్గదర్శకాలు రూపొందించడంలో ప్రభుత్వం బిజీగా ఉంది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. భృతిగా చెల్లించాలా… లేదా స్టైఫండ్ గా ఇవ్వాలా అనేది తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. నెలకు రూ.1000 ఇవ్వాలా? రూ2 వేలా? అనేదీ ఖరారు కాలేదు. 

చెల్లింపులెంత? ప్రాతిపదిక ఏమిటి అనే అంశాల్లో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నిరుద్యోగులకు నేరుగా భృతి చెల్లించడం కన్నా వారి నుంచి సేవలు పొంది స్టైఫండ్ గా ఇస్తే బాగుంటుందన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోందని అంటున్నారు. ఉచితంగా సొమ్ములు ఇవ్వడం కన్నా వేరే మార్గంలో సహాయం అందిస్తే మంచిదనే భావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ భృతికి ఎంపిక చేసిన యువతను ఆయా గ్రామాలు పట్టణాల్లో వివిధ సేవా కార్యక్రమాల్లో వినియోగించుకునేలా చూడాలని గతంలోనే ప్రతిపాదించారు.

ఇదే సమయంలో భృతి చెల్లించాల్సిన యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించడం ద్వారా వారికి ఉద్యోగావకాశాలు లేదా స్వయంఉపాధి అవకాశాలు లభించేలా చూడాలనే అభిప్రాయాన్నీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మార్గదర్శకాలు ఇలా రూపొందితే నిరుద్యోగ భృతి అనేది స్టైఫండ్గా మారిపోగలదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా చర్చల్లోనే ఉందని ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదని సమాచారం. మరోవైపు ఒక్కో నిరుద్యోగికి ఎంత మొత్తం ఇవ్వాలనే అంశాన్నీ ప్రభుత్వం తేల్చడంలేదు. వాస్తవానికి నెలకు రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ముందుగా భావించినా ఏదైనా శిక్షణ ఇప్పిస్తూ రూ.1000 ఇస్తే ఎలా ఉంటుందనేది చర్చిస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply