సైన్స్ కాంగ్రెస్ హైలైట్స్…

0
222
science congress meeting at tirupathi highlights

Posted [relativedate]

science congress meeting at tirupathi highlightsస్వాతంత్య్రం సిద్ధించిన తరువాత చేపట్టిన ఆర్థిక సంస్కరణల అనంతరం భారతదేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న సైన్స్‌ కాంగ్రెస్‌లో చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ జిఎస్‌టి, నోట్ల రద్దు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణల తరువాత ఇవి అతి పెద్ద నిర్ణయాలని ఆయన అన్నారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ప్రధాని మోడీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక్కడ జరుగుతున్న ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సు వేదికపై మోడీ పురస్కారాలను ప్రదానం చేశారు.

శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌లో మోడీ ప్రసంగించారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 104వ సదస్సులో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన నగరం తిరుపతి అని కొనియాడారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.

పెద్దనోట్ల రద్దుతో రాజకీయ రంగంలోనూ పెద్దఎత్తున సంస్కరణలు రానున్నాయని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌లో చంద్రబాబు ప్రసంగించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద ఆర్థిక సంస్కరణకు నాంది పలికిందన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఉగ్రవాదం, నల్లధనాన్ని నివారించవచ్చునని స్పష్టం చేశారు.

శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రోత్సహిస్తున్నారని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ కొనియాడారు. సైన్స్‌ కాంగ్రెస్‌ సద్ససులో హర్ష వర్దన్‌ ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత ఇంతలా సహకరించిన ప్రధానిని ఎప్పుడూ చూడలేదనన్నారు. సామాన్యుల చెంతకు శాస్త్ర, సాంకేతిక రంగాలు చేరువయ్యేలా కృషి చేయాలని తెలిపారు. మన దేశంలో శాస్రతవేత్తలకు కొదవ లేదన్నారు. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు మన శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారని గర్వపడ్డారు

Leave a Reply