కృత్రిమ సూర్యుడు రెడీ అయిపోయాడు…

 Posted March 25, 2017

scientists Make An Artificial Sun on Earthఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఆర్టిఫియల్ వస్తువుల్ని కనిపెట్టేస్తన్నాడు మానవుడు. పండించే కూరగాయలకి, బియ్యానికి కూడా ఆర్టిఫియల్ వచ్చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే  పంచభూతాల్లో ఒకటైన గాలిని కూడా ఆర్టిఫియల్ చేసేశారు.  ప్రస్తుతం మనం వాడుతున్న ఫ్యాన్లు కృత్రిమ గాలి కిందే వస్తాయి కదండీ.. అలానే ఇప్పుడు కృత్రిమ సూర్యుడ్ని కూడా రెడీ చేసేశారు.

కృత్రిమ సూర్యుడు రెడీ అవ్వడం  ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమేనండి కృత్రిమ సూర్యుడ్ని రెడీ చేసేశారు బెర్లిన్ శాస్త్రవేత్తలు. అత్యంత శక్తిమంతమైన  149 ఫిల్మ్ ప్రొజెక్టర్  స్పాట్ లైట్లను ఒక్కచోటుకు తీసుకురావడం ద్వారా కృత్రిమ సూర్యుడ్ని రూపొందించగలిగారు. సిన్ లైట్ ఎక్స్ పరిమెంట్ అని ఈ కృత్రిమ సూర్యుడికి  పేరు కూడా పెట్టారు. సిన్ లైట్ ఎక్స్ పరిమెంట్ జరుగుతన్న సమయంలో మనుషులు అక్కడికి వెళితే మాడి మసైపోతారట.  సిన్ లైట్ ఎక్స్ పరిమెంట్ ద్వారా భూమిని తాకే సహజసిద్ధమైన సూర్య కాంతి కన్నా 10 వేల రెట్లు అధిక వెలుగును ఉత్పత్తి చేయవచ్చని అంటున్నారు.

ఈ సిన్ లైట్ లోని దీపాలన్నీ ఒకే బిందువువైపు కేంద్రీకృతమై ఉంటాయి. దీన్ని గనక ఆన్ చేస్తే అది 3500 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది.ఈ నేపథ్యంలో రేడియోధార్మికత వెలువడకుండా సీల్ చేసిన గదిలో ఈ  ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. నలుగురు నివసించే ఒక ఇంటికి ఏడాది పాటు ఖర్చయ్యే విద్యుత్తును ఇది నాలుగు గంటల్లోనే వాడేస్తుందని, ఈ ప్రయోగం బాగా ఖర్చుతో కూడుకున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినా ఇది అందించే అద్భుత ఫలితాల దృష్ట్యా ఈ ఖర్చు ఆమోదయోగ్యమేనని అంటున్నారు. ఈ ప్రయోగం ద్వారా  కాలుష్య రహిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్నది తమ లక్ష్యమంటున్నారు.  కార్బన్ డైఆక్సైడ్ రహిత ఇంధనంతో విమానాలు, కార్లు నడవాలంటే వందల కోట్ల టన్నుల హైడ్రోజన్  అవసరమవుతుంది. ఈ కృత్రిమ సూర్యకాంతిని ఉపయోగించి హైడ్రోజన్ ప్యూయల్ సెల్స్ ఉత్పత్తి చేసే తీరును శోధించాలనుకుంటున్నామని వివరించారు. ఈ ప్రయోగంలో పరిశోధకలు విజయం సాధించాలని మనమూ కోరుకుందాం.

SHARE