పురాణగాథ నిజమేనన్న శాస్త్రవేత్తలు

0
418
scientists-proved-the-ancient-stories-are-true
  Posted [relativedate]
temple1పురాణగాథ నిజమేనన్న శాస్త్రవేత్తలు వేల ఏళ్ల క్రితం ప్రవహించిన చంద్రభాగా నది పురాణాల్లో ఉండే చాలా నదులు.. ప్రాంతాలు.. నిజ జీవితంలో కనిపించడం అరుదే.. అందుకే వాటిని ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకుని వదిలేస్తుంటారు.. కాని అలా పురాణాల్లో పేర్కొన్న చంద్రభాగా నది కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రవహించిందని శాస్త్రవేత్తలే నిరూపించారు.. ఒడిసాలోని కోణార్‌ సూర్యదేవాలయం సమీపంలోనే ఆ నది ప్రవహిస్తూ ఉండేదని గాథల్లో ఉండేది.. వాస్తవానికి అక్కడ నదేది లేదు.. ప్రస్తుతం ఐఐటీ-ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు అక్కడ నది ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలతో నిరూపించారు. అంతరించిపోయిన ఈ నది ఇక్కడ ప్రవహించిన విషయం వాస్తవమేనని నిర్ధారించారు.రాడార్లను, ఉపగ్రహ చిత్రాలు, గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్‌లు, ఇతర సాంకేతిక సమాచారాన్ని వినియోగించుకుని ఐఐటీ భూగర్భ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
templeప్రాచీన కాలంలో దీని ఉనికి నిజమేనని, తూర్పు తీరానికి సమాంతరంగా ఈశాన్య రాష్ట్రాల వైపు నదీ ప్రవాహం ఉండేదని ప్రొఫెసర్‌ విలియం కుమార్‌ మహంతి తెలిపారు. పలు ప్రాంతాల్లో దీని కారణంగా ఏర్పడిన చిత్తడి నేలలను తమ పరిశోధనల్లో గుర్తించామన్నారు. కోణార్క్‌ సూర్య దేవాలయాన్ని ఈ నది ముఖద్వారం వద్దనే నిర్మించినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఇక్కడి నుంచి నది ఉత్తరంగా ప్రవహించిందని, ఒడిసాలోని తికర్పాడ గ్రామంలో ఈ నదికి సంబంధించిన పూర్వపు కాలువ ఒకటి ఇప్పటికీ నీటితో ఉందని వెల్లడించారు. పరిశోధనల్లో తాము పరిశీలించిన మ్యాప్‌లలో నదీ ప్రవాహం వల్ల ఏర్పడే ఒండ్రు మట్టి నేలలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి ఊటలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశంతో పురాణాల్లో చాలా చరిత్ర దాగుందని.. కాకపోతే ఆధారాలు లేక కొట్టిపారేస్తున్నారని.. ఇటువంటి పరిశోధనలు మరిన్ని జరిపితే చాలా నదులు.. ప్రాంతాలు మరిన్ని వెలికి వస్తాయని… హిందుత్వవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply