బూతులు త‌ట్టుకోలేకపోతున్న శ‌శిక‌ళ‌!!

0
261
scolding letters to sashikala

 Posted [relativedate]

scolding letters to sashikala
బెంగళూరు జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న శ‌శిక‌ళ‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా లేఖ‌లు వ‌స్తున్నాయి. కొంప‌దీసి చిన్న‌మ్మ అభిమానులెవ‌రైనా రాస్తున్నారా? అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఆమెకు అంత సీన్ లేదు కానీ… అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే క్యాడ‌ర్ ఈ లేఖ‌లు రాస్తున్నారు.

త‌మిళ‌నాడులో శ‌శిక‌ళ అంటేనే అంతెత్తున లేస్తున్నారు అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే క్యాడ‌ర్. ఆమెను నేరుగా క‌లిసే అవ‌కాశం లేదు కాబ‌ట్టి ఆ కోపాన్నంతా లేఖ‌ల్లో రాసి… బెంగుళూరు జైలుకు పోస్ట్ చేస్తున్నారు. శ‌శిక‌ళ‌, సెంట్ర‌ల్ జైలు, ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార‌, బెంగ‌ళూరు-560100 అడ్ర‌స్ తో ఆలేఖ‌లు వ‌స్తున్నాయ‌ట‌. ఇలా జైలుకు రోజురోజుకు వ‌చ్చే లేఖ‌ల సంఖ్య పెరుగుతూనే ఉంద‌ట‌. తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో సహ తిరుచ్చి, కరూర్, దిండిగల్, మదురై, ధర్మపురి, సేలం, కృష్ణగిరి తదితర ప్రాంతాల నుంచి ఈ ఉత్తరాలు వ‌స్తున్నాయి.

ఆ లేఖ‌ల‌ను మొద‌ట్లో చ‌దివేవార‌ట శ‌శిక‌ళ‌. ఇప్పుడు చ‌ద‌వ‌డం మానేశార‌ట‌. దాని కార‌ణం ఆ లేఖ‌ల్లో విప‌రీత‌మైన బూతులు ఉంటున్నాయ‌ట‌. చిన్న‌మ్మ‌ను బండ‌బూతులు తిడుతూ.. నోటికొచ్చిన‌ట్టు శాప‌నార్థాలు పెడుతున్నార‌ట‌. అమ్మ‌ను పొట్ట‌న‌బెట్టుకుంది నీవేనంటూ శ‌శిక‌ళ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

జైలు వ‌ర్గాల ప్ర‌కారం ఓ లేఖ‌లో… విశ్వాసఘాతకురాలివి, వెన్నుపోటుదారువి, నీకు కనీస కృతజ్ఞత లేదు… నీకు జీవితాన్ని, సర్వస్వాన్ని ఇచ్చిన వ్యక్తినే మోసం చేశావు.. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన నిర్వాకానికి అంతకంతకు అనుభవిస్తావు” అని శ‌శిక‌ళ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. దీంతో ఈ బూతులు త‌ట్టుకోలేక చిన్న‌మ్మ ఈ లెట‌ర్లను చ‌ద‌వ‌డం మానేశార‌ట‌. ఒక్కోసారి కోపంతో ఆ లెట‌ర్ల‌ను అక్క‌డిక‌క్క‌డే చించి ప‌డేస్తున్నార‌ట‌. అస‌లే జైలు వాతావ‌ర‌ణం ప‌డ‌ట్లేదంటే… ఈ లెట‌ర్లతో చిన్న‌మ్మ‌కు మ‌న‌శ్శాంతి క‌రువైపోయింద‌ట‌.మొత్తానికి ఎన్నిక‌ల వేళ ఈ లెట‌ర్ల వ్య‌వ‌హారం ఇప్పుడు చిన్న‌మ్మ వ‌ర్గంలో గుబులు రేపుతోంది!!!

Leave a Reply