ఆ ఓపెనర్లు అక్కడ చితక కొడుతున్నారు..

    sehwag gambhir twitter comment about delhi politics heavy rain
ఒకప్పటి డాషింగ్ ఓపెనర్స్ వీరేంద్ర సెహ్వాగ్ ,గౌతమ్ గంభీర్ ఢిల్లీ పిచ్ పై వర్షంలోనే చితక కొట్టేస్తున్నారు.వాళ్ళు టీం లోనే లేరనుకుంటున్నారా? వాళ్ళు ఆడుతోంది ..సిక్సర్లు కొడుతోంది ..ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వాల మీద.దేశ రాజధాని ఢిల్లీలోభారీ వర్షం కురిసింది.డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లు కాల్వలయ్యాయి.అడుగు బయటకి పెట్టడానికి వీల్లేకుండా పోయింది.దీంతో ట్విట్టర్ ద్వారా గంభీర్ మొదటి బౌండరీ కొట్టాడు …ఏమనంటే…

పడవలు కొనుక్కునే రోజులొచ్చాయని కామెంట్ చేశాడు.దాన్ని అందిపుచ్చుకొన్న సెహ్వాగ్ సిక్సర్ కొట్టాడు..ఏమనో తెలుసా? సోదరా ఒక్క పడవ సరిపోదు.రెండు కొనుక్కో ..ఒకటి బేసి సంఖ్య..మరోటి సరి సంఖ్య ఉండేలా చూసుకోమని ట్వీటాడు.ఢిల్లీ ట్రాఫిక్ సమస్య నివారణకు కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుకు తెచ్చాడు.మొత్తానికి ఢిల్లీ డాషింగ్ ఓపెనర్లు మైదానం బయటా ట్విట్టర్ వేదికగా బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు.

SHARE