సెల్ఫీ రాజా  తెలుగు మూవీ రివ్యూ – సెల్ఫీలో క్లారిటి తగ్గింది

207
Spread the love

Posted [relativedate]

selfi raja movie review

రేటింగ్ – 2/5

తారాగణం:అల్లరి నరేష్,కామన రనావాట్, సాక్షీ చౌదరి

దర్శకత్వం: జి ఈశ్వర్ రెడ్డి

నిర్మాత: చలసాని రామబ్రహ్మం చౌదరి

సంగీతం:సాయి కె కార్తీక్

     సెల్ఫీ మేనియాక్ సెల్ఫీరాజాగా అల్లరి న‌రేష్ తన కామెడితో ఆడియన్స్ కితకితలు పెట్టిండానికి మరోసారి సిద్దమయ్యాడు. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సిధ్దు ఫ్రం శ్రీకాకుళం ఫేమ్ ఈశ్వర రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా ని రామబ్రహ్మం చౌదరి నిర్మించారు.కామ్న రనావాట్, సాక్షీ చౌదరి నరేష్ సరసన హీరోయిన్స్ గా నటించిన సెల్ఫీ రాజా ఏ మేర ఆడియన్స్ ని ఆకట్టుకుందో
చాలా కాలం గా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నరేష్  కు ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందించిందో ఓ సారి చూద్దాం..
    

చిత్ర కథ

ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్ కు వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి.ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనదైన మార్క్ తో సెల్ఫీ రాజా గా మనముందుకు వచ్చాడు.సింపుల్ గా సెల్ఫీ రాజా సినిమా కధ ఇలా సాగుతుంది.రాజా ( నరేష్) సెల్ఫీలంటే పిచ్చి. తను తీసుకునే సెల్ఫీలతో ఎప్పుడు పక్కవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు.అలాంటి రాజా కి శ్వేతా(కామ్నా రణావత్) అనే అమ్మాయి ఎదురౌతుంది.తొలిచూపులోనే ఆ అమ్మాయి ప్రేమిస్తాడు రాజా. శ్వేతకు కూడా రాజా నచ్చడంతో తనను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. శ్వేతా కుటుంబ సభ్యులకు కూడా నచ్చడంతో ఇద్దరికి పెళ్లి చేస్తారు. కొన్ని కారణాల వలన శ్వేతా పెళ్ళైన రోజునే రాజాను వదిలివెళ్లిపోతుంది. దాంతో కాకి (రవిబాబు) అనే వాడికి డబ్బు ఇచ్చి తనను చంపమని చెప్పుతాడు రాజా.ఈ లోగా మరికొందరు రాజా ను చంపాలని ప్రయత్నిస్తారు. ఇంతకీ రాజాను చంపడానికి ప్రయత్నిస్తున్న వారెవరు..? రాజాను కాకి చంపాడా.? శ్వేతా రాజాల ప్రేమ చివరికి ఏమైంది.ఈ ప్రశ్నలకు సమాధానాలు వెండి తెర పైనే చూడాలి

నటీనటుల ప్రతిభ

   రోటిన్ సినిమాలను ఎంచుకుంటూ వరుస ప్లాప్స్ ని అందుకుంటున్న నరేష్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూశాడు .కాని చేస్తున్న పొరపాటే మరోసారి చేశాడు .కధను ఎంచుకోవటం లో తప్పుచేసినా తన పాత్రకు మాత్రం న్యాయం చేసాడు. ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు.సినిమా కోసం తాను ఎంత చేయవచ్చో అంతా చేశాడు నరేష్.తన దైన స్టయిల్ ఆప్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను నవ్వించటం లో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.కంగానా అందాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి.సాక్షీ కూడ మునపటి కన్న ఎక్కవగానే అందాలు ఆరబోసింది… హీరోయిన్స్ గ్లామర్ డోస్ ఆడియన్స్ కు మంచి ఫీస్ట్ అనే చెప్పాలి.హావభావాలను సరిగ్గ పలకరించలేక పోయినా  అందాల విందు మాత్రం ఎక్కడా తగ్గకుండ చేసారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఫర్వాలేదనిపిస్తాడు. ఇక ఆ తర్వాత చాలా మంది కమెడియన్స్ తెరమీద కనిపిస్తున్నా నవ్వులు మాత్రం రావు. వీళ్ళ యాక్టింగ్ అంతంతమాత్రం. ఆ సీన్స్ స్థాయి కూడా అంతే.

సాంకేతికవర్గం పనితీరు

కామిడి ఎంటర్ టైనర్స్ అన్ని ఒకేలా వుంటాయి..కాసేపు హాయిగా ఆడియన్స్ ను నవ్వించగలిగితే చాలు సినిమా విజయపధం లోకి  దూసుకుపోతుంది…కాకపోతే ప్రజెంట్ చేసే పధ్దతే ఆ సినిమాను హిటా ఫటా అని డిసైడ్ చేస్తుంది.ఇక్కడే దర్శకుడు తడబడ్డాడు.కధ కధనం అకట్టుకునే రీతిలో చెప్పలేక పోయాడు. ‘సెల్ఫీ రాజా’ కొత్తగా ఉంటుందేమో అని థియేటర్ కు వెళ్లే ఆడియన్స్ అసహనానికి గురి కావడం ఖాయం. డైలాగ్స్ కూడ సో సోగానే వున్నాయి. సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ ఫర్వాలేదు.ఎం.ఆర్. వర్మ సినిమాను మేక్సిమం కుదించి మంచి పనితనమే చూపించాడు.సెకెండ్ హాఫ్ కొంచం బోరింగ్ గా అనిపించింది.నిర్మాణ విలువలు బాగున్నాయి.చిన్న సినిమాకు గ్రాండ్ లుక్ తెచ్చారు.

మంచి

అల్లరి నరేష్

హీరోయిన్స్ గ్లామర్

కామిడి టైమింగ్

చెడు

డైరెక్షన్

కధనం

ఫస్ట్ హాఫ్

కామిడి సీన్స్

 

చిత్ర విశ్లేషణ

      సినిమా కధ కధనం పట్టించుకోకుండ కూసింత సేపు సరదాగా నరేష్ ఫర్ఫామెన్స్ ,హీరోయిన్స్ అందచందాలను చూస్తు ఎంజాయ్ చేయ్యాలి అనుకుంటే   ట్రై చేయవచ్చు.

*గీత తల్లాప్రగడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here