ఆ సెల్ఫి వల్లే రూ 22 లక్షలు దొరికాయి

0
461
selfie proved the thief

Posted [relativedate]

selfie proved the thiefఒక్క సారి సరదాగా చేసే పనులు ప్రాణాల మీదకి వస్తే నిన్న విజయవాడలో సెల్ఫ్ తీసుకొంటూ కాలు విరక్కోట్టుకున్నాడు ఒక యువకుడు.ఈరోజు మరో చోట దొంగల్ని పట్టించింది సెల్ఫి .ఏదో కమర్షియల్ యాడ్ లో అన్నట్టు.మరక మంచిదే..సెల్ఫీ మహిళా దొంగల ముఠాను పోలీసులకు పట్టిచ్చిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. విషయం ఏమిటంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసముంటున్న ప్రవాసభారతీయ మహిళ నీలంకుమారి సాప్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. నీలంకుమారి ఈ నెల 9వతేదీన ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియెట్ మెట్రో స్టేషను వద్ద భర్తతో కలిసి ప్రయాణిస్తుండగా రూ.22 లక్షల విలువగల నగలతో కూడిన బ్యాగును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు

ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా నీలంకుమారి రైల్వేస్టేషనులో తీసిన సెల్ఫీని పరిశీలించారు.ఆ సెల్ఫీలో ఓ మహిళా జేబు దొంగ నీలంకుమారి వెనుక ఉండటం చూసి పోలీసులుపట్టేసారు ఇంకేముంది కేసు సాల్వ్ అయ్యింది. మహిళా దొంగను పట్టుకొని ఇంటరాగేషన్ చేయగా మిగిలిని ఐదుగురు మహిళా దొంగల వివరాలు చెప్పింది వారినుంచి రూ,22లక్షల విలువచేసే నగలను స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫి లు హెల్ప్ కి థాంక్స్ చెప్తున్నారు ఆ దంపతులు.

Leave a Reply