ఎన్టీఆర్ డెసిషన్ వెనుక సీనియర్ హీరోలు.

0
334

Posted [relativedate]

senior heros suggestion to ntr decision
జనతా గ్యారేజ్ హిట్ తర్వాత కొన్ని నెలల పాటు కొత్త కధలు విన్న ఎన్టీఆర్ చివరికి డైరెక్టర్ బాబీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హిట్ సినిమాలు తీసిన దర్శకులు వెంటపడ్డా కాదన్న ఎన్టీఆర్ ఓ భారీ ప్లాప్ మూటకట్టుకున్న బాబీ కి పచ్చ జెండా ఊపడానికి కారణం ఎవరో తెలుసా ? మెగా స్టార్ చిరు, విలక్షణ నటుడు కమల్. ఎస్ మీరు చదివింది నిజం. ఆ హీరోలు త్రిపాత్రాభినయం చేసిన విచిత్ర సోదరులు , ముగ్గురు మొనగాళ్లు తరహాలో నటనకి ప్రాధాన్యమున్న మూడు పాత్రలు ఉండటం తో ఆ అవకాశం మిస్ కాకూడదని ఎన్టీఆర్ బాబీ కి ఓకే చెప్పాడంట.

ఎన్టీఆర్ కొత్త సినిమాలో కేవలం త్రిపాత్రాభినయమే చేయడం కాదు …ఓ పాత్ర కి సంబంధించి ప్రయోగం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏ పాత్ర అయినా స్పాట్ లో చేసేసే ఎన్టీఆర్ ఆ పాత్ర కోసం ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.సీనియర్ హీరోలు మూడు పాత్రలతో చెలరేగి పేరు తెచ్చుకున్నట్టే ఎన్టీఆర్ కూడా ఆ పాత్రతో అభిమానుల్ని,సినీ ప్రేమికుల్ని రంజింపచేయబోతున్నాడు.ఏదేమైనా కమల్,చిరు స్ఫూర్తి తో ఎన్టీఆర్ కొత్త సినిమా స్టార్ట్ కాబోతోంది.

Leave a Reply