తాత బయోపిక్ నా వల్ల కాదు : ఎన్టీఆర్

senior ntr biopic junior ntr

ఎన్టీఆర్ పోలికలతో జూనియర్ నందమూరి అభిమానుల మనసు గెలిచాడు. స్టార్ గా సూపర్ స్టార్ గా తారక్ ఎదిగిన తీరు హర్షించదగినది. అయితే తనకు స్పూర్తిగా నిలిచిన తాత బయోపిక్ చేయాలంటే మాత్రం తన వల్ల కాదు అంటున్నాడు తారక్. ప్రస్తుతం భారతీయ సినిమాల్లో బయోపిక్ ల హవా కొనసాగుతుంది. ఇక అదే క్రమంలో పెద్దాయన బయోపిక్ లో ఎన్టీఆర్ ను చూడొచ్చా అన్న ప్రశ్నకు సమాధానంగా పై విధంగా స్పందించారు.

తన జీవితానికి ఓ స్పూర్తిదాయమైన మనిషి తాతగారు. మీరు ఇప్పుడే కాదు మరో పదేళ్ల తర్వాత అడిగినా సరే తాతలా నేను చేయలేను అని తెగేసి చెప్పేశాడు యంగ్ టైగర్. ఇక తనకు చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన సినిమాల్లో నటించాలని ఉందని అన్నారు. సోషియో ఫ్యాంటసీలో తాను చేసిన యమదొంగ సక్సెస్ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్న తారక్ ఆ తర్వాత మరో ప్రయత్నం చేస్తే అది పోయిందని శక్తి ప్రస్తావన తెచ్చారు. ఏది ఏమైనా ఎవరు ఏం చెప్పినా తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే అది కచ్చితంగా జూనియర్ మాత్రమే చేయగలడు చేస్తాడు అని ప్రతి తెలుగు సిని ప్రేక్షకుడికి తెలుసు. పైకి కాదన్నా తారక్ మనసులో కూడా చేయాలనే తపన ఉండే ఉంటుంది.. ఎందుకంటే తనకు తాత అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే కదా.

SHARE