కోస్తాలో సెన్సేషన్…దేశంలోకి వంగవీటి?

0
286
sensation vangaveeti entry in tdp

Posted [relativedate]

sensation vangaveeti entry in tdp
రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో తెలియదు.పైగా రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో మేధావులు కూడా ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తున్నాం.ఇప్పుడు ఆంధ్ర ,కోస్తాలో అలాంటిదే ఓ సంచలనం జరగబోతున్నట్టు తెలుస్తోంది.13 జిల్లాలు మాత్రమే వున్న చిన్న రాష్ట్రంలో ఓ చిన్న మార్పు కూడా రాజకీయంగా పెను ప్రభావం చూపే అవకాశముంది.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే టీడీపీ,వైసీపీ అధినేతలు చంద్రబాబు,జగన్ పావులు కదుపుతున్నారు.

అభివృద్ధి,అవినీతి ఆరోపణల వైపు రాజకీయం తిరిగినంత కాలం భవిష్యత్ ఉండదని జగన్ కి అర్ధమైంది.అందుకే కిందటి ఎన్నికల్లో పవన్ పిలుపుతో తనకు అధికారాన్ని దూరం చేసిన కాపులని టీడీపీ కి వ్యతిరేకం చేసేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు.జగన్ సూచనతో ముద్రగడ ఆట బాగానే ఆడుతున్నా ఫలితం ఎలా ఉంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.కానీ జగన్ తన ప్లాన్ సక్సెస్ అయ్యిందనుకున్నారో ఏమో గానీ కోస్తాలో రెండు ప్రధాన కులాల మధ్య వైరం లో కీలక పాత్ర పోషించిన వంగవీటి కుటుంబాన్ని లైట్ తీసుకోవడం మొదలెట్టారట.రంగా కుమారుడికి ఇక ఏ ఆప్షన్ లేదనుకున్నారో ఏమో ఆయనకి పెద్దగా పడని వెల్లంపల్లిని విజయవాడ రాజకీయాల్లో ఫోకస్ చేస్తున్నారు.అటు ముద్రగడ పోరుతో కాపులు ఇక వైసీపీ వైపు ఉంటారన్న నమ్మకం కూడా జగన్ కి ఉండి ఉండొచ్చు.

జగన్ వ్యూహాలు,ముద్రగడ పోరాటాల్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఓ మాస్టర్ ప్లాన్ కి స్కెచ్ వేశారు.వంగవీటి కుటుంబాన్ని టీడీపీ లోకి లాగితే బాగుంటుందని బాబు అనుకుంటున్నారు.అటు వైసీపీ లో పరిణామాలు కూడా కలిసి రావడంతో బాబు త్వరపడి రాధాని ఆకర్షించే పని పార్టీ ముఖ్యులకు అప్పజెప్పాడు.ఆ పని అనుకోని వేగంతో ముందుకెళ్లినట్టు సమాచారం.జగన్ వైఖరితో విసిగిపోయిన రాధా టీడీపీ లోకి వెళ్తే ఎలా ఉంటుందని తన సన్నిహితుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్టు సమాచారం.ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయితే నిజంగా అది కోస్తాలో సంచలనాలకు బాటలేస్తుంది.టీడీపీ లోకి వంగవీటి కుటుంబం వస్తే ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగినట్టే.

Leave a Reply