సెల్వం కోసం గోడ దూకిన ఎమ్మెల్యే!!

0
220
seravanan jump to panneer selvam party

Posted [relativedate]

seravanan jump to panneer selvam party
సాధారణంగా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతుంటారు. అలా పార్టీలు మారినప్పుడు గోడలు దూకారని చెబుతారు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం నిజంగానే గోడ దూకారు. అదీ పన్నీర్ సెల్వం కోసం.

మధురై ఎమ్మెల్యే శరవణన్ వారం రోజులుగా శశికళ శిబిరంలోనే ఉన్నారు. ఆయన పేరుకే అక్కడ ఉన్నారు కానీ మనసంతా సెల్వం వైపే ఉంది. ఎందుకంటే ఆయన మొదట నుంచి సెల్వం మనిషే. కాబట్టి క్యాంప్ నుంచి బయట పడేందుకు అన్నిరకాలుగా ఆలోచించారు. కుదరలేదు. పైగా ఆయనపై శశికళ వర్గానికి అనుమానం వచ్చిందట. దీంతో శరవణన్ ను నీడలా ఫాలో అయ్యారట. ఇక బయటపడేందుకు అవకాశం లేకపోవడంతో సోమవారం రాత్రి పక్కా స్కెచ్ వేశారు. అర్థరాత్రి మాట మారువేషం వేసుకున్నారట. ఏకంగా రిసార్ట్ గోడ దూకి అక్కడ్నుంచి పరారయ్యారు.

గోడదూకి జంప్ అయిపోయిన శరవణన్ నేరుగా సెల్వం దగ్గరకు వెళ్లిపోయారు. సెల్వం సారుకు జై కొట్టి గురుభక్తిని చాటుకున్నారు. అప్పుడు గానీ శశికళ వర్గానికి తెలియలేదు… ఒక ఎమ్మెల్యే జారిపోయాడని.
శరవణన్ .. సెల్వంతో క్యాంపులో ఏం జరుగుతుందో అన్నీ వివరించారట. దీంతో చిన్నమ్మ వర్గం ఎలాంటి స్కెచ్చులేస్తుందో సెల్వంకు అర్థమైపోయింది. !!

Leave a Reply