సెంగొట్టయన్ తో శశికళ డ్రామా!!!

Posted February 14, 2017

seshiakla drama with sengottaiyan
ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవాలని శశికళ గట్టి పట్టుదలతో ఉంది. అందుకోసం ఎన్ని డ్రామాలకైనా సిద్ధమంటోంది. సెంగొట్టయన్ ను సీఎం అభ్యర్థిగా తెరపైకి రావడం కూడా అందులో భాగమేనని ప్రచారం జరుగుతోంది.

సెంగొట్టయన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని శశికళ నిర్ణయించిందని వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇంతలో సెంగోడియన్ లేచి నాకు ఆ పదవి వద్దు… మీరు ఒక్కరే ఆ పదవి అర్హులు అంటూ కూర్చున్నారట. అంతే..! శశికళే సీఎంగా ఉండాలంటూ మిగతా ఎమ్మెల్యేలు కూడా గొంతు కలిపారు. చిన్నమ్మ జిందాబాద్ అనే నినాదాలు మిన్నంటాయి. ఇంకేముంది? ఎమ్మెల్యేల దృష్టిలో శశికళ ఇమేజ్ ఆమాంతంగా పెరిగింది.

సెంగొట్టయన్ పేరు తెరపైకి తీసుకురావడం వెనక జనంలో సానుభూతి పొందడమే ముఖ్య ఉద్దేశ్యమట. అటు ఎమ్మెల్యేలు… ఇటు జనంలో తన ఇమేజ్ పెరగడానికే ఈ వ్యూహం పన్నిందట. మొత్తంగా తాను అధికారం కోసం వెంపర్లాడడం లేదనే ప్రచారం జనంలోకి వెళ్లేలా శశికళ ప్లాన్ చేసింది. ఆ ప్రచారం జరిగిపోగానే… మళ్లీ షరా మామూలుగానే సీఎం కావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

మొత్తానికి సెంగొట్టయన్ పేరుతో శశికళ చేసిన డ్రామా బాగానే వర్కవుట్ అయ్యిందట. చిన్నమ్మకు ఈ ప్రచారం బాగానే కలిసి వచ్చిందని టాక్. మరి శశికళనా.. మజాకా…!!

SHARE