శశి’కల’ చెదిరింది!!

Posted February 14, 2017

seshikala 6 years jail punishment
శశికళకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో ఆమెను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆమె సీఎం పదవి చేపట్టేందుకు అవకాశం లేనట్లే అని తేలింది. ఈ కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆరేళ్ల పాటూ ఆమె ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. శశికళతో పాటూ ఇళవరసి, సుధాకరన్ లను కూడా దోషులగా తేల్చింది కోర్టు. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై సుధీర్ఘ విచారణ జరిపిన బెంగళూరు కోర్టు జయలలిత, శశికళలను దోషులుగా తెల్చింది. దీంతో కర్ణాటక హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లిన జయ, నిర్దోషిగా బయటకు వచ్చారు. అయితే కర్ణాటక ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లడంతో సుప్రీం కోర్టు, కర్ణాటక హైకోర్టు తీర్పుతో విభేదించింది. ఇద్దరు జడ్జీలు శశికళను దోషిగా తేల్చారు.

SHARE