జయ వారసులకు పూలబాట..శశి,పన్నీర్ పోటాపోటీ?

0
239
seshikala and panneer selvam following jayafamily members

Posted [relativedate]

seshikala and panneer selvam following jayafamily members
సుప్రీమ్ కోర్ట్ తీర్పుతో షాక్ తిన్న శశికళ అంతలోనే తేరుకుంది.తనకు దక్కని సీఎం కుర్చీ పన్నీర్ కి దక్కకూడదని శశికళ డిసైడ్ అయిపోయింది.నిన్నటిదాకా పార్టీ సీనియర్ నేత సెంగోట్టియెన్ పేరు ముందుకు తెచ్చిన చిన్నమ్మ హఠాత్తుగా ఓ సరికొత్త వ్యక్తిని సీన్ లోకి తెచ్చింది.అతనెవరో కాదు జయ మేనల్లుడు దీపక్.శశికళని తూర్పారబడుతున్న దీపా కుమార్ సోదరుడు.జయ అంత్యక్రియల సమయంలో శశికళ పక్కనే కనిపించిన కుర్రవాడు.రాజకీయం అంటే తెలియని అతన్ని సీఎం గా చేసి జయ వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు శశి ప్లాన్ వేశారు.గోల్డెన్ బే రిసార్ట్ లో తనకు అండగా వున్న ఎమ్మెల్యేలకు ఇదే విషయాన్ని ఆమె వెల్లడించారు.

సుప్రీమ్ తీర్పు తర్వాత సంబరాల్లో మునిగితేలుతున్న పన్నీర్ వర్గానికి శశి నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇప్పటికే దీపా కుమార్ కి పెద్ద పీట వేయాలని పన్నీర్ ఆలోచిస్తున్నారు.ఇప్పుడు శశి ఇచ్చిన ట్విస్ట్ తో తప్పనిసరిగా ఇక దీపా కుమార్ కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని పన్నీర్ చెప్పక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.ఏదేమైనా జయలలిత బతికివున్నన్నాళ్లు ఆమె కుటుంబ సభ్యులకు దూరంగా వుంది.శశికళ ప్రభావమో ఇంకొకరి ప్రభావమో గానీ జయ సొంత అన్న సంతానం పోయెస్ గార్డెన్ లో ఒక్క నిద్ర కూడా చేయలేకపోయింది.కానీ ఇప్పుడు అదే వ్యక్తులకి పదవులు ఇవ్వడానికి అన్నాడీఎంకేలో హోరాహోరీ తలపడుతున్న రెండు వర్గాలు సై అంటున్నాయి.అదే చిత్రం..రాజకీయ విచిత్రం.

Leave a Reply