Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయ వున్నప్పుడు సర్వం అనుభవించి అదే ఆశతో అధికారం కోసం అలివిగాని ప్రయత్నం చేసి జైల్లో కూర్చున్న శశికళతో చంద్రబాబు,జగన్ ని పోల్చడం చాలా మందికి మింగుడుపడక పోవచ్చు.కానీ ఓ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే,తాజా పరిణామాల్ని జాగ్రత్తగా అంచనా వేస్తే ఆ ఇద్దరి కన్నా శశి బెటర్ అని ఒప్పుకుంటారు.
జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటినుంచి వైసీపీ నేతల కళ్ళు మెరిసిపోతున్నాయి.టీడీపీ నేతల మొహాలు ఉడుకు మోత్తనం కనిపిస్తోంది.ఈ రెండు పార్టీలు కేంద్రంతో పోరాటానికో,మోడీ తో కయ్యానికో ఈ దూకుడు చూపడంలేదు.ప్రధాని ప్రాపకం కోసం,మోడీ దయ కోసం బజారున పడి అల్లరల్లరి చేస్తున్నాయి.కేంద్రాన్ని ప్రశ్నించడం కోసం గాకుండా సామంతులుగా ఉండేందుకు కుస్తీలు పడుతున్నాయి.ఎవరు ఔనన్నా ఇంకెవరు కాదన్నా ఇదే నిజం.కానీ జైల్లో కూర్చున్న శశికళ ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు కానీ అన్నాడీఎంకే ని బీజేపీ తొత్తుగా మార్చడం ఇష్టం లేక ఎంతటి పోరాటానికైనా సిద్ధపడింది.బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ఐటీ ప్రయోగించినా,ఈడీ దాడులు చేసినా,పాత కేసులు తిరగదోడినా ఆమె తరపున ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆపలేకపోయింది. ఆమె జైలుకెళ్లినా ఆ పార్టీ మీద పట్టు సాధించడానికి బీజేపీ ఇప్పటికీ ఎన్ని తంత్రాలు చేస్తుందో చూస్తున్నాం.కానీ ఇంకా సక్సెస్ కాలేదు.ఇప్పుడు మీరే చెప్పండి..చంద్రబాబు,జగన్ కన్నా శశి నయం కాదంటారా?