మోడీకి శశికళ తొలి సవాల్ ?

Spread the love

     Posted [relativedate]  

seshikala challenge to modi
అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడం ఖరారైన రోజే చిన్నమ్మ శశికళ తనపట్ల సానుకూలంగా లేని కేంద్రానికి, ప్రధాని మోడీకి తొలి సవాల్ విసిరారు.మాజీ సీఎస్ రామ్మోహన్ ,శేఖర్ రెడ్డి వంటి వారి మీద ఐటీ దాడులు తనకు హెచ్చరిక అని తెలిసినా ఆమె వెనకడుగు వేయలేదు .పైగా కేంద్రం కొమ్ముకాస్తున్న సీఎం పన్నీర్ సెల్వం నోటితోనే తనకి పార్టీ పగ్గాలు అప్పగించే తీర్మానాన్ని పలికించారు .ఆ విధంగా కేంద్రం ,మోడీ చర్యలకి భయపడబోనన్న సంకేతాలు ఇచ్చారు. అదే విధంగా మద్రాస్ హై కోర్ట్ జస్టిస్ జయ మృతి మీద చేసిన వ్యాఖ్యల్ని తెలివిగా కేంద్రం మెడకి చుట్టారు . జయ ఆరోగ్యానికి సంబందించిన నివేదికలు ఎప్పటికప్పుడు కేంద్రం తెప్పించుకుందని …కోర్ట్ కావాలనుకుంటే కేంద్రం నుంచే సమాచారం తీసుకోవచ్చని పార్టీ అధికార ప్రతినిధి, శశికళ అనుచరురాలు సరస్వతి వ్యాఖ్యానించారు

శశికళ భర్త నటరాజన్ ఢిల్లీ వెళ్లి ఎంత ప్రయత్నించినా ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ దొరక్క తిరిగి వచ్చేసారు .ఆ విధంగా మోడీ తన మనసులో ఏముందో చెప్పకనే చెప్పారు .కానీ శశి వెనుకడుగు వేయలేదు .మరో వైపు అన్నాడీఏంకేని సరైన టైం చూసుకుని సరైన దారిలో నడిపిస్తానని జయ మేనకోడలు దీప ఈరోజే చేసిన ప్రకటన వెనుక కేంద్రం హస్తముందని అన్నాడీఎంకే శ్రేణులు డౌట్ పడుతున్నాయి .ఏదేమైనా తమిళ రాజకీయాలు కేంద్రంగా రసవత్తర పోరుకి రంగం సిద్ధమైంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here