చెదిరిన చిన్న‌మ్మ చెన్నై క‌ల‌!!!!

0
274
seshikala chennai plan disappointed

Posted [relativedate]

seshikala chennai plan disappointed
భ‌ద్ర‌తా కార‌ణాల‌ను సాకుగా చూపి బెంగ‌ళూరులోని ప‌రప్ప‌ణ అగ్ర‌హార జైలు నుంచి సొంత‌రాష్ట్రానికి వ‌చ్చేయాల‌ని చిన్న‌మ్మ ప‌క్కా స్కెచ్ వేసింది. బెంగ‌ళూరు జైలులో శ‌శిక‌ళ‌కు ముప్పుంద‌ని ఆమె త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టులో పిటిష‌న్ కూడా వేశారు. బెంగ‌ళూరు నుంచి త‌న‌ను చెన్నై జైలుకు షిఫ్ట్ చేయాల‌న్న‌ది ఆమె వ్యూహం. కానీ ఆమె ఆశ‌లు అడియాస‌లుగానే మిగిలి పోయే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి.

బెంగ‌ళూరులో ఉంటే త‌మిళ‌నాడులో చ‌క్రం తిప్ప‌డం శ‌శిక‌ళ‌కు అంత సులువు కాదు. ఏం జ‌రుగుతుందో టీవీల ద్వారానే తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది. ములాఖ‌త్ లు కూడా కొంచెం క‌ష్ట‌మే. అదే చెన్నై జైలు అయితే త‌న‌కు కావాల్సిన వ్య‌క్తి సీఎం అయ్యాడు కాబ‌ట్టి…. ఏం చేసినా న‌డుస్తుంది. అందుకే చిన్న‌మ్మ‌ను చెన్నై జైలు కు వ‌చ్చేందుకు ఆమె వ‌ర్గం ఎత్తులు వేస్తోంది.

ప్ర‌స్తుతం శ‌శిక‌ళ బ్యారక్ కు అనుబంధంగా ఉండే మ‌రో గ‌దిలో సీరియ‌ల్ కిల్ల‌ర్ సైనేడ్ మ‌ల్లిక శిక్ష అనుభ‌విస్తోంది. ఆమె వ‌ల్లే త‌న‌కు ముప్పు పొంచి ఉంద‌ని చిన్న‌మ్మ భావిస్తోంది. ఇందులో వాస్త‌వం ఉందో.. లేదో కానీ ఇదే సాకుగా కోర్టుకు వెళ్లింది మ్యాట‌ర్. అయితే శ‌శిక‌ళ ఎత్తుల‌ను బెంగళూరు జైలు అధికారులు ముందే గ్ర‌హించిన‌ట్టున్నారు. ఏకంగా సైనేడ్ మ‌ల్లిక‌ను మ‌రో జైలుకు త‌ర‌లించారు. భ‌ద్ర‌తా కార‌ణాల‌ను సాకుగా చూపెట్టకుండా శ‌శిక‌ళ‌కు గ‌ట్టి షాకే ఇచ్చారు.

ఇప్పుడు సైనేడ్ మ‌ల్లిక‌ను అక్క‌డ్నుంచి త‌ర‌లించేయ‌డంతో ఇక కోర్టు కూడా శ‌శిక‌ళను చెన్నై త‌ర‌లించ‌డానికి ఒప్పుకునే అవ‌కాశాలు త‌క్కువే. చిన్న‌మ్మ‌కు ఆ అవ‌కాశం ఇవ్వొద్ద‌నే బెంగళూరు ప‌రప్ప‌ణ అగ్ర‌హార జైలు అధికారులు ఈ స్కెచ్ వేశార‌ట‌. వేయ‌డ‌మే కాదు అందులో స‌క్సెస్ కూడా అయ్యారు. మొత్తానికి చిన్న‌మ్మకు… ఆమె వ‌ర్గానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు.

Leave a Reply