శశి భర్త నటరాజన్ ఎక్కడ..?

0
312
seshikala husband natarajan missing

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

seshikala husband natarajan missingఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలుకు పరిమితం అయిన చిన్నమ్మ శశికళకు భారీ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే అధినేత్ర జయలలిత మరణం అనంతరం పార్టీని గుప్పెట్లోకి తీసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కన్న శశికళ కుటుంబంపై ఐటీ గురి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట శశికళ ఆ తర్వాత ఆమె అక్క వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ టార్గెట్ గా సాగిన ఆపరేషన్ ఇప్పుడు చిన్నమ్మ ఆస్తుల మీద పడినట్లు తెలుస్తోంది. శశికళ భర్త నటరాజన్ అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశం అయింది.

ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసులో ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోనే మకాం వేసిన అధికారులు టీటీవీ దినకరన్ పుట్టుపూర్వోత్తరాలు బయటకు లాగుతున్నారు. ఆయన కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. చిన్నమ్మ అక్రమాస్తులను తేల్చడంలో పడ్డ ఢిల్లీ పెద్దలు ఇప్పటికే శశికళకు చెందిన అనేక అక్రమ ఆస్తుల వివరాలు పరిశీలిస్తున్నారని సమాచారం. తమిళనాడు ప్రభుత్వ పర్యవేక్షణలోని టాస్మాక్ వైన్ షాప్ లకు భారీ మొత్తంలో మద్యం సరఫరా చేస్తున్న మిడాస్ లిక్కర్ కంపెనీ జాజ్ సినిమాస్ ఓ దినపత్రిక జయ టీవీ తదితర ఆస్తులు శశికళ బినామీ పేర్లతో ఉన్నాయని అందులో ఆమెకు ఎన్ని షేర్లు ఉన్నాయి మిగిలిన షేర్లు ఎవరిపేరుతో ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారని అంటున్నారు.

చిన్నమ్మ భర్త గాయబ్ అవడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో శశికళ కుటుంబ సభ్యులు కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా సైలంట్ గా ఉండి.. మళ్లీ పార్టీలో హల్చల్ చేసిన నటరాజన్.. ఉన్నట్లుండి మాయం కావడం వెనుక కేంద్రం హెచ్చరికలు పనిచేశాయని అనుకుంటున్నారు. కేంద్రం పుణ్యమా అని శశికళ, నటరాజన్ మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ నటరాజన్ కు ఇలా అండర్ గ్రౌండ్ లో ఉండటం కొత్త కాదంటున్నాయి. అన్నాడీఎంకే వర్గాలు

Leave a Reply