సెల్వం వైపు శ‌శిక‌ళ భ‌ర్త మొగ్గు!!

0
288
seshikala husband supports paneer selvam

Posted [relativedate]

seshikala husband supports paneer selvam
ఇక సీఎం కుర్చీ క‌ష్టమే అనుకుంటున్న త‌రుణంలో శ‌శిక‌ళ లాస్ట్ బాల్ ఆడేందుకు సిద్ధ‌మైంది. అదే సీఎం అభ్య‌ర్థిగా సెంగొట్ట‌య‌న్ ను తెర‌పైకి తీసుకురావ‌డం. త‌న‌పై వ్య‌తిరేక‌త ఉంది కాబ‌ట్టి… సెంగొట్ట‌య‌న్ ను తీసుకురావడం ద్వారా ప‌న్నీర్ సెల్వంకు చెక్ పెట్టాల‌న్న‌ది ఆమె వ్యూహం. కానీ ఈ వ్యూహం కూడా ఆమెకు క‌లిసి వ‌చ్చేలా లేదు.

ఎమ్మెల్యేల‌తో సెంగొట్ట‌య‌న్ గురించి చెబితే… ఎమ్మెల్యేల మాట అటుంచి క‌నీసం ఆమె భ‌ర్త న‌ట‌రాజ‌న్ కూడా అందుకు ఒప్పుకోలేదు. వేరే వ్య‌క్తిని సీఎం చేయ‌ద‌లుచుకుంటే… అదేదో ప‌న్నీర్ సెల్వంనే కొన‌సాగించి ఉండే అయిపోయేది క‌దా అని శ‌శిపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడ‌ట. అన‌వ‌స‌రంగా ఆశ‌ప‌డి ఇబ్బందులు కొని తెచ్చుకున్నావ‌ని గ‌ట్టిగానే చెప్పాడ‌ట‌. ఎమ్మెల్యేల ముందే ఈ మాట‌లు అన‌డంతో చిన్న‌మ్మ‌కు త‌ల కొట్టేసినంత ప‌ని అయిపోయింద‌ట‌. ఏం చెప్పాలో తెలియ‌క ఆమె అక్క‌డ్నుంచి వెళ్లిపోయింద‌ని టాక్.

మొత్తానికి శ‌శిక‌ళ భ‌ర్త మాట‌ల్లోనూ నిజం లేక‌పోలేదు. వేరే అభ్య‌ర్థిని తెర‌పైకి తీసుకురావ‌డం కంటే.. సెల్వంనే కొన‌సాగించి ఉంటే… ఆమె ద‌ర్జాగా ఉండేది. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా మ‌హారాణిలా వెలిగిపోయేది. ఇంకొంత‌కాలం వెయిట్ చేస్తే.. ఆ కుర్చీయే త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చేది. కానీ ఏం చేస్తాం…శ‌శిక‌ళ ఒక వాస్త‌వం మ‌రిచిపోయింది. రాజ‌కీయాల్లో హ‌త్య‌లుండ‌వు… ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయ‌ని… ఇప్పుడు చిన్న‌మ్మ కూడా చేసింది అదేనేమో!!!

Leave a Reply