శ‌శిక‌ళది మేక‌పోతు గాంభీర్య‌మేనా?

0
321
seshikala is acting strong

Posted [relativedate]

seshikala is acting strong
త‌మిళ‌నాడు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న ప‌న్నీర్ సెల్వం … శ‌శిక‌ళ‌పై తిరుగుబాటు అయితే చేసేశారు. కానీ అందుకు త‌గ్గ బ‌ల‌ముందా అన్న సందేహాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న మాత్రం ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేది లేదంటున్నారు. త‌న‌స‌త్తా చూపిస్తానంటూ చిన్న‌మ్మ‌పై వాగ్బాణాలు సంధిస్తున్నారు. దీంతో సెల్వంకు ఎంతో కొంత బ‌లం మాత్రం క‌చ్చితంగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

234 స్థానాలున్న త‌మిళ‌నాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలున్నారు. డీఎంకే నుంచి 89 మంది, కాంగ్రెస్ కు 8, ముస్లింలీగ్ కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ప‌న్నీరు సెల్వం ముఖ్య‌మంత్రి కావాలంటే 118 మంది ఎమ్మెల్యేల‌ మ‌ద్ద‌తు అవ‌స‌రం. ప్ర‌స్తుతం ప‌న్నీర్ సెల్వంకు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు పలుకుతున్న‌ట్టు తెలుస్తోంది. సీనియ‌ర్ ఎంపీ మైత్రేయ‌న్ తో పాటు మ‌రికొంత‌మంది ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా ఆయ‌న‌ను సపోర్ట్ చేస్తున్నారు. ఇక డీఎంకేకు చెందిన 89 మంది ఎమ్మెల్యేలు కూడా సెల్వంకు మ‌ద్ద‌తిస్తే…. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిపోతారు.

అటు శ‌శిక‌ళ బ్యాచ్ లో 130 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ట్టు చెబుతున్నా… అంత‌మంది లేర‌ని టాక్. సంఖ్యా బ‌లం లేకున్నా… కావాల‌నే చిన్న‌మ్మ మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని సెల్వం వ‌ర్గం ఆరోపిస్తోంది. అంతేకాదు శ‌శి క్యాంపులో ఉన్న కొంత‌మంది ఎమ్మెల్యేలు ప్ర‌స్తుతానికి ఆమె ద‌గ్గ‌ర ఉన్నా… స‌రైన స‌మ‌యంలో సెల్వం వైపే ఉంటార‌న్న వాద‌న వినిపిస్తోంది. అలా సెల్వం వైపు చూసే ఎమ్మెల్యేలు ఎంత లేద‌న్నా 15 నుంచి 20 మంది ఉండే అవ‌కాశ‌ముంద‌ట‌. కాబ‌ట్టి చిన్న‌మ్మ ఎన్ని క్యాంపులు న‌డిపినా క‌ష్ట‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

డీఎంకే ఎమ్మెల్యేలు 89 మందిని క‌లుపుకుంటే… సెల్వంను అడ్డుకునే ద‌మ్ము చిన్న‌మ్మ‌కు ఉండ‌దు. అటు స్టాలిన్ కూడా చిన్న‌మ్మ‌ను ఎదుర్కొనేందుకు సెల్వంకు మ‌ద్ద‌తు ప‌లికేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్. అదే జ‌రిగితే శ‌శిక‌ళకు ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం ఖాయం.

Leave a Reply