శ‌శిక‌ళ సీఎం కావ‌డం క‌లయేనా?

0
261
seshikala is not going to become cm

Posted [relativedate]

seshikala is not going to become cm
ఏ అంశాన్న‌యినా తెగే దాకా లాగితే అస‌లుకే ఎస‌రొస్తుంది. ఇప్పుడు త‌మిళ‌నాడులో చిన్న‌మ్మ చేస్తోంది కూడా అదే. ఎందుకంటే ప్ర‌స్తుతం శ‌శిక‌ళ‌ అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లను ఎదుర్కొంటోంది. ఒక్క క్యాంపులో త‌ప్ప మ‌రెవ్వ‌రూ ఆమెను చేసే ప‌రిస్థితి లేదు. అటు క్యాడ‌ర్ గానీ.. ఇటు జ‌నంలో ఆమెకు స‌పోర్ట్ ల‌భించ‌డం లేదు. కేవలం ఎమ్మెల్యేల‌ను న‌మ్ముకుంటూ ఆమె మొండిగా ముందుకెళ్తోంది. ఈ త‌రుణంలో ఆమె బ‌ల‌నిరూప‌ణకు అవ‌కాశం ఇవ్వాలంటూ మారాం చేస్తోంది.

నిజానికి శ‌శిక‌ళ గ‌వ‌ర్న‌ర్ కు ఇచ్చిన లిస్టులో 130 మంది ఎమ్మెల్యేల సంత‌కాలున్నాయి. అంటే ఇప్పుడామె క్యాంపులో 130 మంది ఉండాలి. కానీ ఆమె క్యాంపులో తిప్పి కొడితే అటు ఇటుగా 90 మంది ఉన్నారు. అంటే లెక్క‌లో ఆమె 40మందిని ఎక్కువ‌గా చూపింది. పోనీ ఈ 90 మంది ఎమ్మెల్యేల‌తో ఆమె ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకుంటుందా… అంటే అదీ లేదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగ‌ర్ కు కావాల్సిన సంఖ్య 117. అంటే ఇంకా 27 మంది ఎమ్మెల్యేలు కావాలి. అటు డీఎంకే నుంచి ఎమ్మెల్యేలు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఒక‌వేళ కాంగ్రెస్ స‌పోర్ట్ చేసినా.. వారి సంఖ్య 10 లోపే. ఈ స‌మ‌యంలో ఆమె సెల్వం వ‌ర్గం నుంచి త‌ప్ప ఎమ్మెల్యేల‌ను స‌మీక‌రించేంత సీన్ లేదు. కానీ అదీ కుద‌ర‌డం లేదు. ఎందుకంటే సెల్వం వ‌ర్గం రోజురోజుకు బ‌ల‌ప‌డుతోంది. అక్క‌డ‌ ఎమ్మెల్యేల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ్యాజిక్ ఫిగ‌ర్ ను చేరుకోవ‌డం చిన్న‌మ్మ క‌ష్టమైన ప‌నే. ఒక‌వేళ గ‌వ‌ర్న‌ర్ అవ‌కాశం ఇచ్చినా ఆమె అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డం త‌థ్యం. దీనికి తోడు కోర్టు తీర్పు వ్య‌తిరేకంగా వ‌స్తే మొద‌టికే మోసం. అందుకే చిన్న‌మ్మ కొంత వేగం త‌గ్గించాల‌ని మ‌న్నార్గుడి మాఫియా కూడా ఆమెకు సూచిస్తోంద‌ట‌. కానీ వినే ప‌రిస్థితిలో ఆమె లేదు. నిన్న‌టిదాకా తెర‌వెన‌క ఉన్న ఆమె.. ఇప్పుడు బ‌హిరంగంగానే వాయిస్ ను పెంచేసింది. సీఎం అవుతానంటూ బీరాలు ప‌లుకుతోంది. అయితే అది ఆమెకు క‌ల‌గానే మిగిలిపోతుందా… అన్న అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Leave a Reply