జయకి తప్పు ఒప్పుకుంటూ శశికళ లేఖ?

Posted February 9, 2017

seshikala letter to jayalalitha
ఇప్పటికి బయటపెట్టింది 10 శాతమే ..ఇంకా 90 శాతం మిగిలే ఉందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హెచ్చరికల వెనుక ధీమా ఏమిటో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తాజాగా ఆయన ఇంకో అస్త్రం ప్రయోగించారు.ఒకప్పుడు పోయెస్ గార్డెన్ నుంచి జయ బయటికి పంపినప్పుడు తిరిగి ఆమె చెంతకు చేరడానికి శశికళ రాసిన లేఖ అది.ఆ లేఖలో జయని ఉద్దేశిస్తూ శశికళ ఏమి రాసిందో ఓ లుక్ వేద్దాం.

” నేను పోయెస్ గార్డెన్ లో ఉండటాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని నా బంధువులు, మిత్రులు కొందరు అక్రమాలకు పాల్పడ్డారు.పార్టీకి చెడ్డ పేరు తెచ్చారు.మీకు కూడా వ్యతిరేకంగా కుట్రలు చేశారు.ఇవన్నీ నాకు తెలియకుండా జరిగాయి.నేను కలలో కూడా మీకు ద్రోహం తలపెట్టను.నా బంధువులు చేసిన తప్పులు మన్నించరానివి.

నేను మీతో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావాలని గానీ ,పదవులు చేపట్టాలని గానీ కోరుకోలేదు.అసలు ప్రజాజీవితంలోకి రావాలన్న ఆశ నాకెప్పటికీ లేదు.మీకోసమే నా జీవితాన్ని అర్పించాను.నన్ను క్షమించి మళ్లీ దగ్గరకు తీసుకోండి.”

ఇలా ఆనాడు జయలలితకు శశికళ రాసిన లేఖని బయటపెట్టడం ద్వారా పన్నీర్ భలే ప్లాన్ వేశారు.ఈ లేఖ ద్వారా శశి బంధువర్గం జయకి వ్యతిరేకంగా కుట్రలు చేసిన విషయాన్ని స్వయంగా చిన్నమ్మ ఒప్పుకున్న విషయం ప్రపంచం దృష్టికొచ్చింది.అంతకన్నా ముఖ్యంగా రాజకీయ,పదవీ ఆకాంక్ష లేదని చెప్పడం వల్లే శశిని జయ దగ్గరకు తీశారు తప్ప ,తన రాజకీయ వారసత్వం శశికి అప్పగించాలని జయ భావించలేదని తమిళులకు అర్ధం అవుతుంది.ఇలా శశి గతంలో రాసిన లేఖని బయటపెట్టి ఆమెని అన్నాడీఎంకే శ్రేణుల ముందు దోషిగా నిలబెట్టడంలో పన్నీర్ సక్సెస్ అవుతారనే అనిపిస్తోంది.

SHARE