Posted [relativedate]
కేంద్రంతో శశికళ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందా అన్న అనుమానాలు అన్నాడీఎంకే శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జయలలిత మాట తప్ప శశికళ ఒక పట్టాన ఎవరి మాటా వినరు. అలాంటిది జయ మరణం తర్వాత ఆమె ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. ఆమె చిటికేస్తే పార్టీలోని తన వర్గం అన్నీ చూసుకుంటుంది. ఎకాఎకిన తనకు కావాలసిన పదవి వరిస్తుంది. కానీ శశి ఇప్పుడు మారారని చెబుతున్నారు. ప్రతి అంశానికి ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారట. అక్కడి నుంచి ఆమోదముద్ర తర్వాతే ప్రతి విషయంలోనూ ఇక ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.
సీతయ్య.. ఎవరి మాట వినని టైపులో ఉండే శశికళ… కేంద్రానికి అంత ఈజీగా తలొగ్గడానికి వేరే కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. శశికళకు సంబంధించిన పలు రహస్యాలు మోడీ టీం దగ్గరకు చేరిపోయాయట. ముఖ్యంగా మన్నార్గుడి మాఫియా అరాచకాలు, జయను అడ్డం పెట్టుకొని వారు చేసిన ఆగడాలు.. ఇవన్నీ డీటైల్స్ తో సహా ఢిల్లీలో ఉన్నాయని సమాచారం. ఈ విషయాలన్నీ స్వయానా కొందరు కేంద్రమంత్రులు శశికళ చెవిన కూడా వేశారట. పనిలో పనిగా దూకుడు తగ్గించుకుంటే ఢిల్లీ నుంచి ఎలాంటి యాక్షన్ ఉండదని భరోసా కూడా ఇచ్చేశారని చెబుతున్నారు. దానికి శశికళ కూడా ఒప్పుకున్నారని సమాచారం. మోడీ ప్రభుత్వం ఎలా చెప్పినా తాను వింటాను.. కానీ అనవసరంగా తన పరువు తీయొద్దని గట్టిగా విన్నవించుకున్నారట శశిగారు.
జయ నిచ్చెలి శశికళ అంత ఈజీగా తలొగ్గుతుందని కేంద్ర పెద్దలు కూడా ఆలోచించలేదట. దీంతో శశికి సహకరించాలని నిర్ణయించుకున్నారట ఢిల్లీ పెద్దలు. అయితే నిచ్చెలి ముందు ఒక కండిషన్ పెట్టారని చెబుతున్నారు. ఏది చేసినా.. ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పారట. లేకపోతే మీట నొక్కితే మ్యాటర్ అంతా లీకైపోతుందని గట్టిగానే చెప్పారట. ఈ మ్యాచ్ ఫిక్సింగే .. రెండు వర్గాల మధ్య జరిగిందని చెన్నైలో పుకార్లు వినిపిస్తున్నాయి