అజిత్ కోసం శశికళ వల..షాక్ ఇచ్చిన హీరో

0
259
seshikala plan for ajith

Posted [relativedate]

seshikala plan for ajith
ఓ వైపు కేంద్ర ఫ్రభుత్వం పరోక్ష హెచ్చరికలు ఎన్ని చేస్తున్నా చిన్నమ్మలెక్కచేయడం లేదు. అన్నాడీఎంకే పగ్గాలతో పాటు తమిళనాడు సీఎం కుర్చీ ఎక్కాలని శశికళ తహతహలాడుతున్నారు.ఆ దిశగా పార్టీలో మద్దతు తో పాటు వివిధ వర్గాల నుంచి సానుకూలత సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు .ఇప్పటికే విజయశాంతి ,శ్రీదేవి లాంటి నటీమణులు పోయెస్ గార్డెన్ కి వెళ్లి శశికళని పలకరించి వెళ్లారు .ఈ సారి ఆ జాబితాలో తమిళనాడులో భారీ పాపులారిటీ వున్నఅజిత్ పేరు కూడా బయటికొచ్చింది.ఒకప్పుడు అజిత్ ని జయ తన వారసుడిగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి .అందులో నిజమెంతోగానీ జయ తో అజిత్ కి మంచి సంబంధాలు వున్న మాట నిజం .అయన కుటుంబ సమేతంగా పోయెస్ గార్డెన్ వెళ్లి జయ ఆశీస్సులు పొందిన సందర్భాలు ఎన్నో .అజిత్ పెళ్లికి కూడా జయ వెళ్లారు .అజిత్ సినీ ప్ర్రత్యర్ధి విజయ్ సినిమాలకి ఇబ్బందులు కూడా జయ వల్లేనని అప్పట్లో బలంగా వినిపించిన మాట .ఈ పరిస్థితుల్లో అజిత్ మద్దతు కోసం శశికళ వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది.

శశికళ కనుసన్నల్లో నడుస్తున్న అన్నాడీఎంకే ఐటీ విభాగం నిన్న పోయెస్ గార్డెన్ గురించి ఆసక్తికరమైన సమాచారం వెల్లడించింది. పోయెస్ గార్డెన్ లో శశికళని అజిత్ కలిసినట్టు ట్విట్టర్ లో ఉంచింది .ఆ సమావేశం వివరాలేమీ బయటికి వెల్లడి చేయకుండా ఈరోజు మరో ట్వీట్ చేసింది .అది కూడా శశికళ ,అజిత్ భేటీ గురించే . వాళ్ళు ఈ రోజు సమావేశం అవుతారని తాజా ట్వీట్ సందేశం .అంటే నిన్న భేటీ జరక్కుండానే ఈ సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే అజిత్ పోయెస్ గార్డెన్ కి రాకుండా చిన్నమ్మకి షాక్ ఇచ్చినట్టే వుంది .అజిత్ జనాకర్షణ కోసమే శశి ఈ విధంగా ప్రకటనలు ఇప్పించి ఉండొచ్చని తమిళనాట పుకార్లు వినవస్తున్నాయి .జయని మెండుగా అభిమానించే అజిత్ శశికళ విషయంలో అంత సానుకూలంగా లేరనే మాటలు వినిపిస్తున్నాయి .అందుకే అయన శశికళ తో భేటీకి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. కొందరు అభిమానులు మరో అడుగు ముందుకేసి అజిత్ తన వారసుడని జయ రాసిన సందేశాన్ని ప్రజలకి చేరకుండా శశికళ అడ్డుకున్నారని చెప్తున్నారు .ఇదంతా చూస్తుంటే తనకి వలేసిన శశికళకి అజిత్ షాక్ ఇచ్చినట్టు అనిపించడంలేదా?

Leave a Reply