ముప్పన్నా ముందుకే శశికళ?

Posted February 6, 2017

seshikala property case in court
తమిళనాడు సీఎం గా పదవీప్రమాణ స్వీకారం చేసేందుకు చిన్నమ్మ శశికళ సర్వసన్నద్ధమయ్యారు. అయితే కుర్చీ ఎక్కే ఆనందం ఆమెకి మిగులుతుందో ,లేదో చెప్పలేం.ఎందుకంటే జయలలితను జీవితాంతం వెంటాడిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వ్యవహారం ఇప్పుడు చిన్నమ్మ మెడపై కత్తిలా వేలాడుతోంది.ఆ కేసులో శశికళ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఆమె పాత్రకి సంబందించిన కేసు తీర్పును సుప్రీమ్ కోర్ట్ మరో వారం రోజుల్లో ఇచ్చే అవకాశం వుంది.ఆ కేసులో తీర్పు వ్యతిరేకంగా వస్తే సీఎం పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే పదవీ గండం ముంచుకొస్తుంది.దీంతో అన్నాడీఎంకేలోని శశి అనుకూలురు తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు.అయినా 9 వ తేదీన ప్రమాణస్వీకారానికి శశికళ రెడీ అయిపోతున్నారు.

ముప్పుందని తెలిసినా ముందుకే వెళ్ళడానికి శశికళ రెడీ కావడానికి ముఖ్య కారణం ముహూర్తమేనట. అనుకున్న ముహూర్తానికి పదవిలో కూర్చుంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుందని మన్నార్ గుడి మాఫియా నమ్మే సిద్ధాంతి చెప్పారట.అందుకే సుప్రీమ్ తీర్పు ముప్పు ఉందని తెలిసినా శశి ముందుకే అడుగులేస్తున్నారు.

SHARE